ETV Bharat / business

కేంద్రం కొత్త స్కెచ్- లాక్​డౌన్​ ఉన్నా వారికి ఉపాధి - latest economy news

దేశవ్యాప్తంగా రహదారుల ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. దీని ద్వారా వలస కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కరోనా కారణంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.

restart-highways-construction
'కరోనాతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
author img

By

Published : Apr 13, 2020, 10:54 AM IST

కరోనా కారణంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశవ్యాప్తంగా రహదారుల ప్రాజెక్టును వెంటనే పునఃప్రారంభించాలన్నారు. సంబంధిత అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు గడ్కరీ. దేశవ్యాప్తంగా 20లక్షల మంది వలస కార్మికులున్నారని, పనులు ప్రారంభిస్తే వారికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుందని స్పష్టం చేశారు గడ్కరీ. రాహదారుల విభాగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఎర్పాటు చేసినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలన్నారు. రూ.లక్ష కోట్లు విలువ చేసే దిల్లీ-ముంబయి ఎక్స్​ప్రెస్​వేతో రాజస్థాన్​లోని వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

" రహదారుల ప్రాజెక్టులు మొదలుపెడితే లాక్​డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కరోనా కారణంగా వచ్చిన సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలి. కనీస జాగ్రత్తలు పాటిస్తూ పనులు సాగించాలి. గతేడాది నిర్మించిన రహదారుల కంటే ఈ ఏడాది రెట్టింపు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయి దాదాపు కోటి ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. రూ.40,000 విలువ చేసే సరకులు కార్మికులు లేక వాహనాల్లోనే ఉన్నాయి."

-నితిన్ గడ్కరీ, కేంద్ర రహదారుల శాఖ మంత్రి.

ఇదీ చదవండి: ఒపెక్ దేశాల డీల్​తో చమురు సూచీల పరుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.