పెట్రోల్, డీజిల్ ధరల్లో వృద్ధితో ఖర్చులు పెరుగుతాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇంధన ధరలపై పన్ను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని వివరించారు దాస్. ఇదే సమయంలో కరోనా నుంచి బయటపడేందుకు అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్నీ గుర్తు చేశారు.
దేశ వృద్ధి రేటు రికవరీలో తయారీ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు దాస్. భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఆర్థిక వృద్ధికి కీలకంగా మారుతున్నట్లు తెలిపారు. కార్పొరేట్లు వైద్య రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:'క్రిప్టోకరెన్సీలతో ఆర్థిక అస్థిరత'