ETV Bharat / business

పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి- దిగొచ్చిన ద్రవ్యోల్బణం - కేంద్ర కార్మిక శాఖ

దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి జూన్​ నెలలో 13.6శాతం వృద్ధి చెందింది. మరోవైపు, జులైలో ద్రవ్యోల్బణం 5.59శాతానికి తగ్గింది.

Industrial production
పారిశ్రామిక ఉత్పత్తి
author img

By

Published : Aug 12, 2021, 7:19 PM IST

భారత పారిశ్రామిక ఉత్పత్తి జూన్​ నెలలో 13.6 శాతం పెరిగింది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది.

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాల ప్రకారం.. తయారీ రంగం జూన్​ నెలలో 13శాతం వృద్ధి చెందింది. మైనింగ్ ఉత్పత్తి 23.1శాతం పెరగ్గా.. విద్యుత్ ఉత్పత్తి 8.3శాతం అధికంగా జరిగింది. గతేడాది జూన్​ నెలలో ఐఐపీ 16.6శాతంగా ఉండడం గమనార్హం.

ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో ఐఐపీ 45శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఐఐపీ 35.6శాతంగా ఉంది.

2020 మార్చి నుంచి ఐఐపీ తీవ్రంగా ప్రభావితమవుతూ వస్తోంది. కరోనా వల్ల 2020 మార్చిలో 18.7శాతం పతనమైంది. ఏప్రిల్​లో 57.3శాతం పతనమైంది.

ద్రవ్యోల్బణం ఎంతంటే..

రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 5.59 శాతానికి తగ్గింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గడమే ఇందుకు కారణమని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్​లో 6.26శాతంగా ఉండగా.. 2020 జులైలో 6.73శాతంగా ఉంది.

ఇదీ చూడండి: భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఇదీ చూడండి: 'కొవిడ్ సంక్షోభంలోనూ సాహసోపేత నిర్ణయాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.