ETV Bharat / business

డిసెంబర్​లో పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి - జాతీయ గణాంక కార్యాలయం

తయారీ రంగం ఊతమివ్వగా.. 2020 డిసెంబర్​లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. ఒక శాతం వృద్ధి నమోదైంది. 2021 జనవరిలో ద్రవ్యోల్బణం దిగొచ్చింది.

iip december
డిసెంబర్​లో జోరుగా పారిశ్రామిక ఉత్పత్తి
author img

By

Published : Feb 12, 2021, 8:45 PM IST

తయారీ రంగం అత్యుత్తమ పనితీరుతో 2020 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఒక శాతం వృద్ధి నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) వివరాలు వెల్లడించింది.

కరోనా కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2020 మార్చిలో 18.7శాతం క్షీణత నమోదు కాగా, ఆగస్టు వరకు క్రమంగా తగ్గుతూనే ఉంది. సెప్టెంబర్‌లో ఒక శాతం వృద్ధి నమోదు కాగా, తర్వాతి నెలలో కూడా పెరుగుదల కొనసాగింది. అయితే 2020 నవంబర్‌లో మళ్లీ క్షీణత నమోదై 2.1శాతం తగ్గింది. ఒక నెల విరామం తర్వాత మళ్లీ పెరుగుదల నమోదైంది. 2020 డిసెంబర్‌లో తయారీ రంగం 1.6శాతం వృద్ధి నమోదు చేసింది.

ఉత్పత్తి రంగం 2020 డిసెంబర్​లో 1.6 శాతం వృద్ధి నమోదు చేసి 77.63 శాతానికి చేరింది. మైనింగ్​ రంగం.. 4.8 శాతం క్షీణత నమోదు చేసింది. విద్యత్​ ఉత్పాదక రంగం 5.1 శాతం పెరిగింది.

దిగొచ్చిన ద్రవ్యోల్బణం..

2021 జనవరిలో రిటైల్​ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) భారీగా దిగొచ్చింది. జనవరిలో 4.06 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు తగ్గముఖం పట్టడం వల్లే ఈ తగ్గుదల నమోదైందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. 2020 డిసెంబర్​లో సీపీఐ 4.59 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.