కరోనా నుంచి భారత ఆర్థిక వ్యవస్థ V-ఆకారపు రికవరీని నమోదు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించిన దేశ జీడీపీ.. రెండో త్రైమాసికంలో -7.5 శాతానికి పరిమితం కావడాన్ని ఊటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపింది ఆర్థిక శాఖ నివేదిక.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు -7.5 శాతంగా నమోదైనా.. క్యూ1తో పోలిస్తే మాత్రం 23 శాతం సానుకూల వృద్ధి రేటు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సడలింపులు, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ వంటివి ఇందుకు దోహదం చేసినట్లు వివరించింది.
వ్యవ'సాయం'
ఆర్థిక వ్యవస్థ రికవరీకి వ్యవసాయ రంగం ప్రధానంగా దన్నుగా నిలిచినట్లు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. నిర్మాణ, తయారీ రంగాల సానుకూలతలు సహా లాజిస్టింగ్, కమ్యూనికేషన్ ద్వారా సేవా రంగం కూడా ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమందించినట్లు పేర్కొంది.
ఇవీ చూడండి: