ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్.. రెండంకెల వృద్ధి రేటు(India Growth rate) నమోదు చేస్తుందని నీతి ఆయోగ్(Niti Aayog ) ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 2021-22 ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయని.. ఫలితంగా వృద్ధి పుంజుకుంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
భారత్ పరిస్థితి చాలా బలంగా ఉందని.. ప్రస్తుత పరిస్థితులు పెట్టుబడుల ఉపసంహరణకు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు రాజీవ్ కుమార్.
"వ్యయాల కోసం మరిన్ని నిధులు సమీకరించాల్సిన పరిస్థితి వస్తే.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయొచ్చు. ఎందుకంటే ఆ నిర్ణయాలు మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది."
- రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
కరోనా ముడో దశ(Corona Third wave) వచ్చినా.. ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు రాజీవ్ కుమార్. రాష్ట్రాలు కూడా కరోనాను ఎదుర్కొనే విషయంలో అనేక పాఠాలు నేర్చుకున్నాయని వెల్లడించారు.