ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇప్పటికే ఆర్బీఐ సహా పలు సంస్థలు భారత్ వృద్ధిరేటు తగ్గించాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా వాటి సరసన చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రమంగా తిరిగి పుంజుకుంటుందని తెలిపింది.
" భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికివ్యవస్థ. ఆర్థిక మందగమనం ప్రభావం పడినా.. భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఎక్కువగా ఉంది. "
- హాన్స్ టిమ్మెర్, ప్రపంచ బ్యాంక్, దక్షిణ ఆసియా ముఖ్య ఆర్థికవేత్త
పుంజుకుంటుంది....
ఇటీవల జరిగిన దక్షిణ ఆసియా ఆర్థిక సదస్సులో ఈ మేరకు అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్. 2021లో 6.9 శాతం, 2022లో 7.2 శాతంగా భారత వృద్ధి రేటు నమోదు కానుందని అంచనా వేసింది.
ఇదీ చూడండి: భారత్‌లో ఏటా పెరిగిపోతున్న కోటీశ్వరులు