ETV Bharat / business

'పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్లు అవసరం' - ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్ స్పందన

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ ఎత్తివేయడంలో భారత్ సరైన విధానాలను అవలంబించాలని సూచించారు ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారాయన.

raghuram rajan on economy
ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్ అభిప్రాయం
author img

By

Published : Apr 30, 2020, 12:20 PM IST

లాక్​డౌన్ ఎత్తివేయడంలో భారత్ అత్యంత తెలివిగా వ్యవహరించాలని అన్నారు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఆర్థిక వ్యవస్థను సరైన పద్ధతిలో పునరుద్ధరించాలని సూచించారు. ఎక్కువ కాలం లాక్​డౌన్​ కొనసాగించి, ప్రజలకు సాయం అందించే సామర్థ్యం లేనందున.. భారత్ సరైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం గురించి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో సంభాషణలో ఈ విషయాలు వెల్లడించారు రాజన్.

సంక్షోభ సమయంలోనూ దేశం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు రాజన్. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు సహాయం చేసేందుకు రూ.65,000 కోట్లు అవసరమవుతాయని.. రాహుల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లాక్​డౌన్ కొనసాగించడం సులభమే అయినా.. దాని వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని రాజన్ విశ్లేషించారు.

ఇదీ చూడండి:ఆతిథ్యానికి రూ.50,000 కోట్ల నిధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.