ETV Bharat / business

ఆతిథ్యానికి రూ.50,000 కోట్ల నిధి! - corona effect on tourism

కరోనా వైరస్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన పర్యాటక, ఆతిథ్య రంగాలను ఆదుకోడానికి రూ.50,000 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భారత పర్యాటక, ఆతిథ్య రంగాల పరిశ్రమల సమాఖ్య (ఫెయిత్‌) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దేశీయంగా ఏప్రిల్‌- జులై మంచి పర్యాటక సీజన్‌ కాగా, ఈ మొత్తాన్ని కోల్పోయినట్లేని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.

50,000 crors for package for tourism in India!
ఆతిథ్యానికి రూ.50,000 కోట్ల నిధి!
author img

By

Published : Apr 30, 2020, 11:21 AM IST

పర్యాటక, ఆతిథ్య రంగాలను ఆదుకోవాలని భారత పర్యాటక, ఆతిథ్య రంగాల పరిశ్రమల సమాఖ్య (ఫెయిత్‌) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి నెలకొల్పడంతో పాటు పదేళ్ల కాలానికి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియాన్ని 3 నెలల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు చర్యలు చేపట్టాలని పేర్కొంది.

హోటల్‌ పరిశ్రమకు రూ.90,000 కోట్ల నష్టం

దేశంలో హోటల్‌ పరిశ్రమకు ఈ కేలండర్‌ ఏడాదిలో రూ.90,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లనుందనే అంచనాను ఆతిథ్య రంగంలో కన్సల్టెన్సీ సేవలు అందించే హెచ్‌వీఎస్‌- అనరాక్‌ తాజా నివేదికలో పేర్కొంది. ‘లాక్‌డౌన్‌’ వల్ల రాకపోకలు నిలిచిపోయి కార్యకలాపాలు కొనసాగించలేనందున, సంఘటిత రంగంలోని హోటళ్లకు అధిక నష్టం జరుగుతోందని విశ్లేషించింది. ఈ ఏడాది మార్చిలో దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లలో ‘ఆక్యుపన్సీ నిష్పత్తి’ 53 శాతం తగ్గినట్లు వివరించింది.

రెస్టారెంట్లపై ‘సామాజిక దూరం’ ప్రభావం: గతంలో మాదిరిగా భవిష్యత్తులో రెస్టారెంట్ల నిర్వహణ సాధ్యం కాదని, ‘సామాజిక దూరం’ తరహా నిబంధనల వల్ల రెస్టారెంట్లలో సీటింగ్‌ సామర్థ్యం 40 శాతం తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వ్యాపారంలో ఎక్కువ భాగం ‘ఆన్‌లైన్‌’ పద్ధతిలోకి మార్చుకోవాల్సి రావచ్చని ఆ వర్గాలు విశ్లేస్తున్నాయి. వినియోగదార్లు రెస్టారెంట్లలో అధిక సమయం గడిపేందుకు ఇష్టపడకపోవచ్చు, బదులుగా ‘టేక్‌-అవే’ పద్ధతికి ఎక్కువ మంది మారొచ్చని రెస్టారెంట్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినియోగదార్లు, సిబ్బందికి... ఫేస్‌ మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఇంతకు ముందు మాదిరిగా నిర్వహించటం సాధ్యం కాదనేది ఎక్కవ మంది అభిప్రాయంగా ఉంది.

కొవిడ్‌-19 తర్వాత కోలుకుంటుంది

దేశీయ పర్యాటక రంగం కొవిడ్‌-19 మహమ్మారి కనుమరుగయ్యాక కోలుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ దక్షిణ ప్రాంత డైరెక్టర్‌ శ్రీవత్స్‌ సంజయ్‌ అన్నారు. పర్యాటక- ఆతిధ్య రంగాలపై కొవిడ్‌-19 ప్రభావంపై తెలంగాణా వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) నిర్వహించిన ‘వెబినార్‌’ లో ఆయన పాల్గొన్నారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి మాట్లాడుతూ పర్యాటకులు విదేశాలకు వెళ్లటానికి గతంలో మాదిరిగా అంత ఆసక్తి చూపకపోవచ్చని, దేశీయ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతారని అభిప్రాయపడ్డారు. అనూహ్య మార్పులు తప్పవని చర్చాగోష్టిలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణా అధ్యక్షుడు అశోక్‌ హేమ్‌రజని, టూర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణా అధ్యక్షుడు సిరాజ్‌ అన్సారీ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నయా మోసం.. లింక్​ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ రీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.