ETV Bharat / business

గ్లోబల్​ ట్రేడ్​లో సత్తా చాటిన భారత్, చైనా!

ఎగుమతులు- దిగుమతుల విషయంలో భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐరాస తెలిపింది. క్యూ1లో భారతదేశ వస్తువుల దిగుమతులు 45శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. చైనా ఎగుమతులు కరోనా పూర్వ స్థితి కన్నా మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది.

UN INDIA CHINA TRADE
ఆ విషయంలో సత్తా చాటిన భారత్, చైనా!
author img

By

Published : May 19, 2021, 12:38 PM IST

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు వర్తకం విషయంలో మెరుగైన పనితీరు కనబర్చాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎగుమతులు- దిగుమతులు పెరిగాయని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్​మెంట్(యూఎన్​సీటీఏడీ).. 'గ్లోబల్ ట్రేడ్ అప్​డేట్' పేరిట నివేదిక విడుదల చేసింది.

2020 గణాంకాలతో పోలిస్తే.. భారత్​లో వస్తువుల దిగుమతులు 45 శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. ఈ కాలంలో భారత్​ నుంచి వస్తువుల ఎగుమతి 26 శాతం, సేవల ఎగుమతి 2 శాతం అధికమైనట్లు స్పష్టం చేసింది.

2019 సగటుతో పోలిస్తే వస్తువుల దిగుమతులు 10శాతం, సేవల దిగుమతులు 2 శాతం పెరిగాయని వివరించింది. 2019 గణాంకాలతో పోలిస్తే వస్తువుల ఎగుమతులు 7శాతం పెరగ్గా.. సేవల ఎగుమతులు 3 శాతం తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా..

2021 క్యూ1లో చైనా ఎగుమతులు కరోనా పూర్వ స్థితి కన్నా మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవల వాణిజ్య విలువ 4శాతం పెరిగిందని తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 10శాతం పెరుగుదల అని పేర్కొంది.

ఇదీ చదవండి: ఏప్రిల్​లో​ మూడు రెట్లు పెరిగిన ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.