ETV Bharat / business

2021లో భారత్​దే​ అగ్రస్థానం- చైనాదే 2020!

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మాత్రమే 2021లో రెండంకెల వృద్ధి రేటు (11.5%) నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) అంచనా వేసింది. ప్రపంచార్థికం కూడా ఈ ఏడాది 5.5 శాతానికి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2020లో మాత్రం చైనా మాత్రమే సానుకూల వృద్ధి రేటు (2.3%) నమోదు చేసే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నట్లు వివరించింది.

IMF Forecast on Indian economy
2021లో భారత్ రెండంకెల వృద్ధి
author img

By

Published : Jan 26, 2021, 7:50 PM IST

Updated : Jan 26, 2021, 8:01 PM IST

2021లో భారత్ అత్యధికంగా 11.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండంకెల వృద్ధి రేటు సాధించే ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్​ మాత్రమేనని ఉద్ఘాటించింది.

తాజాగా విడుదల చేసిన వరల్డ్​ ఎకానమిక్ నివేదికలో ఈ విషయాలు పేర్కొంది ఐఎంఎఫ్​.

2021లో 8.1 శాతం వృద్ధి రేటుతో చైనా, 5.9 శాతం వృద్ధి రేటుతో స్పెయిన్.. భారత్ తర్వాతి స్థానాల్లో ఉండొచ్చని వివరించింది.

2022లోనూ భారత్​ అత్యధికంగా 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని పేర్కొంది ఐఎంఎఫ్​. ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

2020లో చైనా మాత్రమే..

2020లో భారత వృద్ధిరేటు క్షీణతను 8 శాతానికి సవరించింది ఐఎంఎఫ్​. గత ఏడాది చైనా మాత్రమే ..సానుకూలంగా వృద్ధి రేటు(2.3 శాతం) నమోదు చేసే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నట్లు వివరించింది.

'టీకా' అండ..

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి తేరుకుని 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా టీకా రాకతో వ్యాపారాలకు ఊతమందుతుందన్న ఆశలు, పలు కీలక దేశాల విధానపరమైన మద్దతును ప్రతిబింబించేలా ఈ అంచనాలను విడుదల చేసింది ఐఎంఎఫ్​.

"వరల్డ్ ఎకానమిక్ అవుట్​లుక్​ తాజా నివేదిక ప్రకారం ప్రపంచార్థికం 2021లో 5.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. అక్టోబర్​లో విడుదల చేసిన అంచనాలకన్నా ఇది 0.3 శాతం ఎక్కువ. 2022లో వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదవ్వచ్చు." - గీతా గోపినాథ్, ఐఎంఎఫ్​ ముఖ్య ఆర్థికవేత్త

2020 అతిపెద్ద సంక్షోభమే..

కరోనా కల్లోలం వల్ల 2020లో ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని అంచనా వేసింది ఐఎంఎఫ్​. ఇంతకు ముందు(-4.4%)తో పోలిస్తే ప్రస్తుత అంచనాలు కాస్త మెరుగవ్వడం విశేషం. 2020 ద్వితీయార్ధంలో అంచనాలకు మించి వృద్ధి నమోదవడం ఇందుకు కారణమని వివరించింది ఐఎంఎఫ్​. అయినప్పటికీ.. 1929-1933 మధ్య కాలంలో ఎదుర్కొన్న మాంద్యం తర్వాత ఇదే అత్యంత దారుణమైన క్షీణత అని స్పష్టం చేసింది.

తగ్గనున్న తలసరి ఆదాయం..

ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల 150కిపైగా దేశాల్లో తలసరి ఆదాయం ఈ ఏడాది.. 2019 కన్నా తక్కువ స్థాయికి పడిపోవచ్చని ఐఎంఎఫ్​ అంచనా వేసింది. 2022 నాటికి ఈ దేశాల సంఖ్య 110కి తగ్గే వీలుందని వివరించింది.

ఇవీ చూడండి:

Last Updated : Jan 26, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.