దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2021-22 వృద్ధి రేటు అంచనాలను సవరించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతమైతే.. 2021-22 వృద్ధి రేటు 9.5 శాతానికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆర్బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతానికి సవరించడం గమనార్హం.
2021-22లో వినియోగదారు ద్రవ్యోల్బణం (సీపీఐ), టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సగటు వరుసగా.. 5.2 శాతం, 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది ఇక్రా.