ETV Bharat / business

ఇలా చేస్తే తక్కువ ధరకే పెట్రోల్​, డీజిల్! - ఫ్యూయల్ క్రెడిట్ కార్డు ఎలా పని చేస్తుంది

పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాస్త (Fuel Prices) తగ్గాయి. అయినా ఇంకా లీటర్ పెట్రోల్ (Petrol price today)​ ధర​ రూ.100పైనే కొనసాగుతోంది. డీజిల్ ధర (Diesel Price today) కూడా రూ.90 పైనే ఉంది. అధిక ధరల వల్ల రోజువారీ అవసరాలకు వాహనాలు వినియోగించే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కొన్ని స్మార్ట్​ చిట్కాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.

Fuel Credit card
ఫ్యూయల్ కార్డ్​
author img

By

Published : Sep 5, 2021, 4:50 PM IST

పెట్రోల్​, డీజిల్ ధరల (Fuel Prices) మంటతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల కోసం చూస్తున్నారు. విద్యుత్​, సీఎన్​జీ వాహనాలకు మారటం ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్ల.. చాలా మంది ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఒకటి క్రెడిట్ కార్డులను (Fuel card) ఉపయోగించటం.

క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా ఇంధన ధరల భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రోజువారీగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి.

బ్యాంకులు వివిధ ఆయిల్ కంపెనీలతో కలిపి కో బ్రాండెడ్ కార్డులను (Co branded credit card) అందిస్తుంటాయి. ఈ కార్డులతో ఆయా కంపెనీల బంకుల్లో పెట్రోల్​, డీజిల్​ పోయించుకుంటే ఎక్కువ రివార్డు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. ఉదాహరణకు ఎస్​బీఐ బీపీసీఎల్ కార్డు తీసుకుంటే 4.25 శాతం వాల్యూ బ్యాక్ వస్తుంది. దీన్ని రివార్డ్ పాయింట్ల రూపంలో పొందవచ్చు.

ఛార్జీల గురించి తెలుసుకోండి..

అయితే ఈ కార్డులను తీసుకోవటం వల్ల భరించాల్సిన ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. జాయినింగ్ ఫీజులు, వార్షిక ఛార్జీల వంటవి ఈ కోవలోకే వస్తాయి. వీటిని రివార్డులతో పోల్చి చూసుకోవాలి. కొన్ని కార్డులు తక్కువ రివార్డులు ఇస్తూ ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చు.

వార్షిక ఫీజులు కార్డును బట్టి మారుతుంటాయి. కొన్ని కార్డులపై ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఒక నిర్ణీత పరిమితి మించి కార్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కార్డును ఉచితంగానే ఉపయోగించుకునే వీలు ఉంటుంది.

కార్డును ఉపయోగించినప్పుడు కనీస ఖర్చు(మినిమం స్పెండింగ్) గురించి తెలుసుకోవాలి. కనీస మొత్తం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి అనుగుణంగా పెట్రోలు ఫిల్లింగ్ ప్రణాళిక చేసుకోవాలి. అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఫిల్లింగ్ చేయించుకునే బదులు.. ఆ పరిమితి ఎక్కువున్నట్లయితే ఆ మేర తక్కువ సార్లు పెట్రోల్ పోయించుకోవడం ఉత్తమం.

అంతేకాకుండా మీరు ఉండే ప్రాంతానికి సమీపంలో ఫ్యూయల్ కార్డుకు సంబంధించిన బంకులు ఉన్నాయా? లేదా ? అనేది గమనించాలి.

వేటి ఆధారంగా నిర్ణయించుకోవాలి?

కార్డు ఎంపికలో రివార్డు పాయింట్లు ప్రధానమైనవి అయినప్పటికీ... ఇవి సాధారణంగా రెండు మూడు ఏళ్లలో ఎక్పైర్ అవుతుంటాయి. దీనికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. సాధారణంగా కార్డులపై వచ్చే రివార్డులను ఎంపిక చేసిన ఈ-కామర్స్ పోర్టళ్లు, ఆఫ్ లైన్ స్టోర్లలో ఉపయోగించుకోవచ్చు.

అదే విధంగా ఏ ఫ్యూయల్ కార్డు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకునే ముందు వార్షిక ఫీజులతో పాటు జాయినింగ్ బోనస్,ఇతర ప్రయోజనాలను పోల్చి చూసుకోవాలి.

ఫ్యూయల్ కార్డులు ఎంపిక చేసిన బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఇతర బంకుల్లో పెట్రోల్​, డీజిల్ పోయించుకోవాల్సి వస్తే.. రివార్డ్​ పాయింట్లు, క్యాష్​ బ్యాక్​లు రాకపోవచ్చు. లేదా చాలా తక్కువగా రావచ్చు.

వీటిని గమనించండి

క్రెడిట్ కార్డుల ఉపయోగించడం ద్వారా క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. రివార్డులు, ఇతర ప్రయోజనాలు ఉన్నప్పటికీ… బిల్లు సరైన సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఆలస్య రుసుములు, ఇతర ఫీజుల భారం అధికంగా ఉంటుంది. ఇవి సాధారణంగా 23 శాతం నుంచి 49 శాతం వరకు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కార్డును ఎంపిక చేసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.