ETV Bharat / business

వాహన బీమా క్లెయిమ్​లో ఈ పొరపాట్లు చేయొద్దు! - వానహ బీమా క్లెయిమ్​లో ఎక్కువగా జరిగే పొరపాట్లు

తమ వాహనానికి బీమా తీసుకున్నాం కదా అని చాలా మంది నిశ్చింతగా ఉంటారు. తీరా ఏదైన ప్రమాదం జరిగాక.. క్లెయిమ్​కు దరఖాస్తు చేసుకుంటే అది తిరస్కరణకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలా వాహన బీమా క్లెయిమ్​లో వచ్చే సాధారణ చిక్కులు ఏమిటి? క్లెయిమ్ త్వరగా రావాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలతో ఓ ప్రత్యేక కథనం మీ కోసం.

How to get an auto insurance claim faster
వాహన బీమా క్లెయిమ్​ వేగంగా పొందాలంటే
author img

By

Published : Jun 24, 2021, 7:57 PM IST

రోడ్డుపైకి వాహనంతో వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రోడ్లపై గుంతలు, అవతలి వాహనదారుడికి సరిగ్గా నడపటం రాకపోవవటం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు అకస్మికంగా బండిలో ఏదైన సమస్య రావటం కావచ్చు.. ఇలా ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బీమా కొండంత ధీమా ఇస్తుంది. ఆర్థిక భారం పడకుండా మనకు అండగా ఉంటుంది.

కాబట్టి.. వాహన బీమా తీసుకోవటం వల్ల కొంత వరకు నిశ్చింతగా ఉండొచ్చు. కంపెనీలను బట్టి కవరేజీ మారుతుంటుంది.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బీమా తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత చేసేల చిన్న చిన్న పొరపాట్ల వల్ల క్లెయిమ్ ప్రక్రియలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. క్లెయిమ్​కు దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైన తర్వాత చేసిన పొరపాటు గ్రహిస్తారు. ఇలా సాధారణంగా ఎక్కుమంది చేసే పొరపాట్లు సహా.. మీకు అలాంటి సమస్య రాకుండా క్లెయిమ్​ ప్రక్రియ సులభంగా జరిగేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎఫ్ఐఆర్

దొంగతనం, ఎవరైనా వాహనాన్ని ద్వంసం చేయడం వంటి కేసుల్లో వాహన బీమా పొందేందుకు ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) తప్పనిసరిగా ఉండాలి. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసి, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని, క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత పరచాల్సి ఉంటుంది. బీమా సంబంధిత అన్ని అంశాల్లో ఎఫ్ఐఆర్ అవసరం లేదు. అయితే ఎఫ్ఐఆర్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది.

డాక్యుమెంటేషన్

బీమా మంజూరులో డాక్యుమెంట్లు చాలా కీలకం. క్లెయిమ్ మంజూరులో చేసేందుకు బీమా సంస్థ.. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్లను సమర్పించాలని అడగవచ్చు. ఇవి లేనట్లయితే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా పాలసీ వ్యాలిడిటీని తనిఖీ చేసుకోవాలి. కొన్ని సార్లు బీమా గడువు ముగిసిన గమనించకపోవచ్చు.

ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవటం

క్లెయిమ్​కు సంబంధించిన దరఖాస్తు ఎంత వీలైతే అంత త్వరగా చేసుకోవాలి. ప్రమాదం జరిగిన మూడు రోజుల్లో క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవటం ద్వారా బీమా పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అయిన కొద్దీ క్లెయిమ్ పొందటం కష్టతరం అవుతుంది.

ప్రమాదం జరిగిన సమయం, క్లెయిమ్ దరఖాస్తు అనేది బీమా సంస్థను బట్టి మారుతుంటుంది. ఎన్ని రోజుల్లో చేసుకోవాలి? దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి? లాంటి వాటిని పాలసీ తీసుకునేటప్పుడే తెలుసుకోవాలి.

బీమా కవరేజీ సరిపోకపోవటం

కొన్ని సందర్భాల్లో కావాల్సిన కవరేజీ మొత్తం గురించి వాహన దారుడికి అవగాహన ఉండకపోవచ్చు. పాలసీ కవరేజీ ఇవ్వని సంఘటనకు బీమా క్లెయిమ్ దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. పాలసీ తీసుకునే సమయంలోనే నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవటం ఉత్తమం. పాలసీ ఏఏ సంఘటనల్లో వర్తిస్తుంది? ఏయే సంఘటనల్లో వర్తించదు అనేది పాలసీ తీసుకునే సమయంలోనే తెలుసుకోవటం ఉత్తమం.

బీమాకు సంబంధించిన అవగాహన..

ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వ్యాల్యూ(ఐడీవీ), డిడక్టబుల్స్, డిప్రిషియేషన్ తదితర పదాల విషయంలో వాహనదారులు కొంత పొరపాటు పడుతుంటారు. ఈ పదాలన్నింటికి క్లెయిమ్ సెటిల్మెంట్​తో సంబంధం ఉంటుంది. వీటిపై సరైన అవగాహన లేనట్లయితే బీమా మొత్తం ఎక్కువ లేదా తక్కువ వస్తుందని భావించే అవకాశం ఉంటుంది. అంచనా వేసిన దానికంటే తక్కువ క్లెయిమ్ వస్తే.. జేబులో నుంచి కొంత మొత్తం చెల్లించాల్సి రావొచ్చు.

నిర్లక్ష్యం

గుంతలు, రోడ్ల నిర్మాణం సరిగా లేకపోవటం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉన్నట్లయితే క్లెయిమ్​ను బీమా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. వాహనదారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో కూడా బీమా తిరస్కరణకు గురవవచ్చు. మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా(గడువు ముగిసినా కూడా) వాహనం నడపటం అనేది చట్టవిరుద్దం. ఇలాంటి సందర్భాల్లో బీమా తిరస్కరణకు గురవుతుంది.

ఆధారాలు..

ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించి ఆధారాలు పొందుపరుచుకోవాలి. డ్యామేజీ, గాయాలకు సంబంధించిన ఫోటోలు క్లెయిమ్ సమయంలో బీమా సంస్థలు అడగవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.