ETV Bharat / business

కరోనాతో పేదరికంలోకి 50 కోట్ల మంది ప్రజలు! - కరోనా వైరస్ వార్తలు

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం అందించాలని అంతర్జాతీయ సంస్థ ఆక్స్ ఫామ్ సూచించింది. లేదంటే కరోనా సృష్టిస్తోన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. వచ్చే వారం మూడు కీలక అంతర్జాతీయ ఆర్థిక సమావేశాల జరగనున్న నేపథ్యంలో ఆక్స్ ఫామ్ ఈ విజ్ఞప్తి చేసింది.

OXFAM
ఆక్స్ ఫామ్
author img

By

Published : Apr 10, 2020, 10:39 AM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమంది ప్రజలు పేదరికంలోకి జారుకుంటారని ఆక్స్ ఫామ్ సంస్థ పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం అందించకపోతే ఈ నష్టం తప్పదని హెచ్చరించింది.

వచ్చేవారం మూడు కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆక్స్ ఫామ్ ఈ విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలని ధనిక దేశాలను సూచించింది. ఇందుకు ధనిక దేశాలు నిరాకరిస్తే ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు 30 ఏళ్లు వెనుకబడతాయని తెలిపింది.

"కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఆర్థిక మందగమనంలోకి కూరుకుపోతోంది. పలు పేద దేశాల్లో ప్రజలు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాళ్లను కాపాడేందుకు ఎలాంటి మార్గం లేదు."

- జోస్ మరియా వెరా, ఆక్స్​ ఫామ్​ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ప్రపంచమంతా దాదాపు లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనాభాలో 6 నుంచి 8 శాతం మంది పేదరికంలోకి జారుకుంటారని లండన్ కింగ్స్ కాలేజీ, ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయాలు అంచనా వేశాయి. ఈ పరిశోధనల ఆధారంగా ఆక్స్ ఫామ్ తాజా నివేదికను రూపొందించింది.

ఉదాహరణకు..

బంగ్లాదేశ్​లో 10 లక్షల మందికిపైగా నేత కార్మికులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలు. లాక్​డౌన్ కారణంగా ఆర్డర్లు నిలిచిపోయాయి. వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వీరికి ప్రస్తుతం ఎలాంటి ఉపాధి వనరులు లేవు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకులతో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు వచ్చేవారం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పేద దేశాలు మాంద్యాన్ని తట్టుకుని నిలబడగలిగేలా ప్రపంచ నేతలు ఆర్థిక ప్యాకేజీ అందించేందుకు ముందుకురావాలని ఆక్స్ ఫామ్ పిలుపునిచ్చింది.

రుణాల చెల్లింపులు..

ఇందులో భాగంగా 2020 ఏడాదికి గానూ అభివృద్ధి చెందుతున్న దేశాలు బకాయి పడ్డ ట్రిలియన్ డాలర్ల చెల్లింపులను రద్దు చేయాలని ఆక్స్ ఫామ్ సూచించింది.

ఉదాహరణకు.. ఘనా దేశానికి రుణాల చెల్లింపు నుంచి విముక్తి కల్పిస్తే.. ఆ దేశంలో 1.6 కోట్ల మంది చిన్నారులు, వృద్ధులకు ఆరు నెలల పాటు నెలకు 20 డాలర్ల చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుందని తెలిపింది.

సాయం పెంచాలి..

ఇతర దేశాలకు సాయంలో 500 మిలియన్ డాలర్లు పెంచాలని.. ఐఎంఎఫ్​లో ప్రత్యేక ఉపసంహరణ హక్కుల కింద ఒక ట్రిలియన్ డాలర్లను కేటాయించాలని ఆక్స్ ఫామ్ సూచిస్తోంది.

ఈ చర్యతో ఆయా దేశాలకు ద్రవ్య లభ్యత పెరుగుతుందని తెలిపింది. ఇథియోపియా వంటి దేశాలకు అదనంగా 630 మిలియన్ డాలర్ల సాయం అందుతుందని స్పష్టం చేసింది. వైద్య రంగానికి అదనంగా 45 శాతం పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి: 'మునుపెన్నడూ చూడని ఆర్థిక పతనం ఇది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.