ETV Bharat / business

'కరోనా ప్యాకేజీ.. వృద్ధి క్షీణతను ఆపలేదు' - india gdp growth rate

ఆర్థిక రంగం బలోపేతానికి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలతో 2021 జీడీపీ వృద్ధి తగ్గుదలలో పెద్దగా మార్పులు ఉండవని ప్రముఖ విశ్లేషకులు అంటున్నారు. ఈ చర్యలు తక్షణమే ప్రభావం చూపవని, దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Govt's stimulus package won't stop GDP from contracting in FY21
కేంద్రం 20 లక్షల ప్యాకేజీతో డీజీపీ వృద్ధిలో మార్పు ఉండదు
author img

By

Published : May 18, 2020, 4:52 PM IST

Updated : May 18, 2020, 6:34 PM IST

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ, ప్రవేశపెట్టబోయే సంస్కరణలు 2021 జీడీపీ వృద్ధిని పెంచలేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా భారత జీడీపీ వృద్ధిలో తగ్గుదల 0.1 శాతం, 5.0 శాతంగానే ఉంటుందని బ్యాంక్​ ఆఫ్ అమెరికా, నోమురా విశ్లేషకులు అంచనా వేశారు.

కరోనా సంక్షోభం కారణంగా పతనమైన ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడిపేందుకు రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఇటీవలే ప్రకటించారు ప్రధాని నేరేంద్ర మోదీ. ఇది జీడీపీలో 10 శాతమని వివరించారు. దీనికి సంబంధించిన ప్రత్యేకతలను, సంస్కరణలను విడతల వారీగా ఐదు రోజుల పాటు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

ఈ చర్యలు వ్యాపార సంస్థల స్వల్పకాలిక సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడవని, మూడేళ్ల పాటు మధ్యస్థకాల వృద్ధికే ఉపయోగపడతాయని బ్యాంక్​ ఆఫ్ అమెరికా, నోమురా విశ్లేషకులు చెప్పారు. దీర్ఘకాలంలో మూలధనాన్ని ఆకర్షిస్తాయని, జీడీపీ వృద్ధిపై అసలు ఎలాంటి ఫ్రభావం ఉండదని స్పష్టం చేశాయి.

వ్యవసాయం, మైనింగ్​, విద్యుత్​, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అన్ని ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయడం వల్ల కాలక్రమేణా వృద్ధి సాధ్యమవుతుందని బ్యాంక్​ ఆఫ్ అమెరికా విశ్లేషకులు వివరించారు. స్వల్పకాలంలో జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిలో 12 శాతం తగ్గుదల నమోదవుతుందని, 2021లో ఇది 0.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

ప్యాకేజీ కారణంగా ఆర్థిక లోటు 0.8 శాతంగానే ఉంటుందని, 2021 ఆర్థిక సంవత్సరం 7 శాతం వ్యత్యాసంతో ముగియవచ్చని నోమురా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభ కాలంలో రాజకీయంగా సున్నితమైన సంస్కరణలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు.

అక్టోబరు నాటికి రిజర్వ్ బ్యాంక్ 0.75 శాతం కంటే ఎక్కువ వడ్డీరేట్లలో కోత విధిస్తుందని, ఆర్థిక లోటును గుర్తించడానికి 75 బిలియన్ డాలర్ల బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని బ్యాంక్ ఆఫ్​ అమెరికా విశ్లేషకులు తెలిపారు.

Last Updated : May 18, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.