ETV Bharat / business

మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.28 శాతం - సీపీఐ ద్రవ్యోల్బణం

ఆహార ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల కారణంగా రిటైల్​ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 9.28 గా నమోదైంది.

BIZ-VIRUS-INFLATION
ఆహార ద్రవ్యోల్బణం
author img

By

Published : Jun 12, 2020, 10:33 PM IST

దేశంలో లాక్​డౌన్​ కారణంగా మే నెలకు గాను కొన్ని వస్తువుల రిటైల్​ ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేసింది ప్రభుత్వం. వీటిలో ఆహార ద్రవ్యోల్బణం 9.28 శాతం నమోదైనట్లు తెలిపింది.

వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్​పీఐ) గ్రామీణ ప్రాంతాల్లో 9.69 శాతం, పట్టణాల్లో 8.36 శాతంగా నమోదయ్యాయి. మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం 9.28 శాతంగా ఉంది.

గతేడాది మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 1.83 శాతం ఉన్నట్లు తెలిపింది.

పరిమిత లావాదేవీల కారణంగా..

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వం వరుసగా రెండో నెల రిటైల్ ద్రవ్యోల్బణంలో కొన్ని వస్తువుల డేటానే విడుదల చేసింది. మార్కెట్లలో ఉత్పత్తులకు సంబంధించి పరిమిత లావాదేవీల కారణంగా రిటైల్​ ద్రవ్యోల్బణంలోని కొన్ని సమూహాల రేట్లనే లెక్కించామని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.