ETV Bharat / business

భారీ అసెట్‌ మానిటైజేషన్‌ దిశగా కేంద్రం.. విలువ ఎంతంటే?

వివిధ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కేంద్రం సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపం)' కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు.

Govt planning for Huge Asset magnetization
భారీ అసెట్ మానిటైజేషన్​
author img

By

Published : Aug 11, 2021, 7:38 PM IST

దాదాపు రూ.6 లక్షల కోట్ల అసెట్‌ మానిటైజేషన్‌ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపం)' కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే బుధవారం వెల్లడించారు. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్ పైప్‌లైన్లు‌, పలు జాతీయ రహదారులు సహా ఇతర ప్రాజెక్టుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పవర్‌గ్రిడ్ పైప్‌లైన్లను మానిటైజ్‌ చేయడం కోసం ప్రత్యేక 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌)'ను నెలకొల్పినట్లు వెల్లడించారు.

ఎయిర్‌పోర్టు నిర్వహణలో 'పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)' సత్ఫలితాలిస్తోందని తెలిపారు తుహిన్‌ కాంత పాండే. ఈ నేపథ్యంలో దీన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజా అసెట్‌ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అసెట్‌ మానిటైజేషన్‌. అంటే, ప్రభుత్వ ఆస్తులను డబ్బు రూపంలోకి మార్చుకోవడం. ఇందులో ఇప్పటికే పూర్తి అయిన మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ప్రైవేటు రంగం వాటి అంతిమ వినియోగదారుల నుంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది.

ఇదీ చదవండి: 'కొవిడ్ సంక్షోభంలోనూ సాహసోపేత నిర్ణయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.