2018-19 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.8శాతానికి తగ్గింది. గత ఐదేళ్లలో ఇదే కనిష్ఠం. ఇదే త్రైమాసికంలో చైనా 6.4శాతం వృద్ధి రేటు నమోదుచేసింది.
వ్యవసాయం, తయారీ రంగాల్లో ప్రగతి మందగించడమే వృద్ధి నెమ్మదించడానికి కారణమని కేంద్ర గణాంకాల కార్యాలయం వివరించింది.
2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తంగా 6.8శాతం వృద్ధిరేటు నమోదైనట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించింది. 2017-18లో ఇది 7.2శాతంగా ఉంది.
చివరిసారిగా 2013-14లో జీడీపీ వృద్ధి రేటు కనిష్ఠంగా 6.4శాతం నమోదైంది. ఆ తర్వాత అంతటి స్థాయికి ప్రగతి సూచీ దిగజారడం ఇదే తొలిసారి.
మరికొంత కాలం అంతే....
"2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి నెమ్మదించడానికి బ్యాంకింగేతర ఆర్థిక రంగం-ఎన్బీఎఫ్సీలో సంక్షోభమే కారణం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ వృద్ధి ఇలానే తక్కువగా ఉండొచ్చు. రెండో త్రైమాసికం నుంచి ప్రగతి రథం వేగం పుంజుకుంటుంది."
-ఎస్సీ గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
ఇదీ చూడండి: షాక్: 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం