GDP estimates for 2021-22: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.9 శాతం వృద్ధి సాధించనుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 5.4 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోలిస్తే జీడీపీ 0.7 శాతం మేర పెరిగిందని జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది.
జనవరిలో విడుదల చేసిన అంచనాల్లో దేశ జీడీపీ 9.2 శాతం వృద్ధి చెందుతుందని జాతీయ గణాంక సంస్థ పేర్కొంది. అయితే, తాజా ప్రకటనలో మాత్రం వృద్ధిని 8.9 శాతంగా అంచనా వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 20.3 శాతం వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి.. జీడీపీ పతనమైంది. ఈ కారణంగా(లో బేస్ ఎఫెక్ట్) క్యూ1లో రికార్డు స్థాయి వృద్ధి సాధ్యమైంది. రెండో త్రైమాసికంలో వృద్ధి 8.5 శాతానికి పరిమితం కాగా.. మూడో త్రైమాసికంలో మరింత తగ్గింది.
2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య చైనా జీడీపీ 4 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: సెబీ నూతన ఛైర్‌పర్సన్‌గా మాధవి పూరీ బుచ్