ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుకోసం కసరత్త్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు ఎప్పుడు వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
డిపాజిటర్ల బీమా 5 రెట్లు పెంపు, దివాల స్మృతిలో ఇటీవలి మార్పుల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్బీఐ నిర్ణయం ఆమోదయోగ్యం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు నిర్మలా సీతారామన్.
సాధారణ, ఎంఎస్ఎంఈ, రియల్టీ రంగాలకు రుణ లభ్యత పెంచేందుకు ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.