2021-22బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్ల నుంచే కరోనా టీకాలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. 'రాష్ట్రాలకు బదిలీ' అనే శీర్షిక.. టీకాల కొనుగోలుకు అడ్డు కాదని పేర్కొంది. టీకాలకు కేటాయించిన నిధులను గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం టీకాలు సేకరించి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోందని వివరించింది.
వ్యాక్సిన్ కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద కాకుండా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిధుల నుంచి ఖర్చు చేస్తుందని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి దీనిని రాష్ట్రాలే నిర్వహిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. అవసరమైతే ఈ రకమైన గ్రాంట్ల నిర్వహణను మార్చేందుకూ అవకాశం లేకపోలేదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'