ETV Bharat / business

జనవరిలో భారీగా ఈపీఎఫ్​ కొత్త చేరికలు

2021 జనవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పేరోల్​లో కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారని కేంద్రం తెలిపింది. 2020 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 27.79 శాతం పెరిగినట్లు చెప్పింది.

EPFO's net new enrolments up 28 pc to 13.36 lakh in January
జనవరిలో జోష్​గా ఈపీఎఫ్​ కొత్త చేరికలు
author img

By

Published : Mar 20, 2021, 9:30 PM IST

2021 జనవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​ఓ) పేరోల్​లో​ కొత్త చేరికలు భారీగా పెరిగాయి. 2020 జనవరితో పోలిస్తే 27.79 శాతం పెరిగి, కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఈపీఎఫ్​ఓ పేరోల్​ డేటాను శనివారం విడుదల చేసింది.

పేరోల్​ డేటాలోని కీలకాంశాలు..

  • 2020 డిసెంబర్​ నుంచి 2021 జనవరి వరకు ఈపీఎఫ్​లో కొత్త చందాదారులు 24 శాతం పెరిగారు.
  • కొవిడ్​ మహమ్మారి ఉన్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి పదినెలల్లో మొత్తం 62.49 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్​ పేరోల్​లో చేరారు.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్​లో చేరిన వారి సంఖ్య 78.58 లక్షలకు చేరింది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
  • దేశవ్యాప్తంగా ఈపీఎఫ్​ఓలో కొత్తగా చేరేవారి జాబితాలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్​, తమిళనాడు, కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి.

ఇదీ చూడండి:నష్టమొచ్చినా సరే.. వారికి పారితోషికం చెల్లించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.