ETV Bharat / business

బీమా పరిహారం పెంచిన ఈపీఎఫ్​ఓ- వివరాలు ఇవే.. - ఈడీఎల్​ఐ బీమా ప్రీమియం

ప్రైవేటు రంగ ఉద్యోగులకు డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ (ఈడీఎల్​ఐ) పథకం ద్వారా అందించే బీమా మొత్తాన్ని పెంచుతూ ఈపీఎఫ్​ఓ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కనీస మొత్తాన్ని రూ.2.5 లక్షలకు, గరిష్ఠ మొత్తాన్ని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈడీఎల్​ఐ పథకం ఏమిటి? ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

EPFO hikes maximum death insurance
ఈపీఎఫ్​ బీమా పెంపు
author img

By

Published : May 20, 2021, 1:12 PM IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) చందాదారులకు అందించే ఉద్యోగుల డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ (ఈడీఎల్​ఐ) పరిహారం మొత్తాన్ని పెంచింది. ఈ పథకంలోని సభ్యులు ఏదైనా కారణంతో మరణిస్తే నామినీకి చెల్లించే కనీస బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు, గరిష్టంగా రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​లో పేర్కొంది ఈపీఎఫ్​ఓ.

ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచే పెంచిన బీమా మొత్తాలు వర్తించనున్నాయి. వచ్చే మూడేళ్ల వరకు ఈ మొత్తాలు కొనసాగనున్నట్లు తెలిపింది ఈపీఎఫ్​ఓ.

ఈడీఎల్​ఐ పథకం అంటే?

ఈపీఎఫ్​ఓ చందాదారులైన ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు అకాలంగా మరణిస్తే.. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. 1976లో ఇది అమలులోకి వచ్చింది. ఈ పథకం ఈపీఎఫ్​లోని క్రియాశీల చందాదారులందరికీ వర్తిస్తుంది.

ఈ బీమా పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి తరఫున ఆయా సంస్థలు నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

ఈపీఎఎఫ్​ చట్టం 1952 ప్రకారం.. ప్రైవేటు రంగ ఉద్యోగులందరికి ఈ పథకం తప్పనిసరి కాదు. ఈడీఎల్​ఐ కన్నా ఎక్కువ కవరేజీనిచ్చే బీమా సదుపాయాన్ని కల్పించే సంస్థలు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే చాలా సంస్థలు ఈడీఎల్​ఐకి బదులు టర్మ్​ ఇన్సూరెన్స్​ను అందిస్తాయి.

ఓ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా క్రియాశీల ఈపీఎఫ్​ చందాదారులు ఉంటే.. అందులో 20 లక్షల మంది మాత్రమే ఈడీఎల్​ఐ పరిధిలో ఉన్నట్లు తెలిసింది.

ఈడీఎల్​ఐ ఎలా పని చేస్తుంది?

రూ.15,000 కన్నా తక్కువ బేసిక్​ శాలరీ వచ్చే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.

ఈ పథకం వర్తించాలంటే.. ఉద్యోగి బేసిక్​ శాలరీలో నెలకు 0.5 శాతం లేదా గరిష్ఠంగా 75 రూపాయలను సంస్థ ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో సభ్యులైన ఉద్యోగులు అకాలంగా మరణిస్తే.. బీమా మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఎంత మొత్తం ఇవ్వాలనేది.. ఉద్యోగి వేతనం, అలవెన్సులు, ఈపీఎఫ్​ ఖాతాలోని నెలవారీ సగటు మొత్తం ఎంత? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఎవరైన ఉద్యోగి నామినీని ఎంపిక చేసి ఉండకపోతే.. న్యాయపరమైన వారసులు, కుటుంబ సభ్యులు బీమాను క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఉద్యోగి మరణానికి ముందు కనీసం 12 నెలలు విధులు నిర్వహించి ఉండాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.