కరోనా వైరస్ పోరులో భాగంగా పీఎం కేర్స్ సహాయనిధికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని గతంలోనే తెలిపింది.
ఇలా తమ యాజమాన్యం ద్వారా ఉద్యోగులు ఇచ్చే విరాళాలకు ప్రత్యేకంగా ఎలాంటి ధ్రువపత్రాన్ని జారీచేయమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. అయితే యాజమాన్యాలు ఉద్యోగులకు సంవత్సరం చివరలో ఇచ్చే ఫారం-16లో విరాళం ఇచ్చిన మొత్తాన్ని చూపిస్తాయని తెలిపింది. ఆ టీడీఎస్ పత్రాన్నే విరాళం ఇచ్చారనేందుకు రుజువుగా పరిగణిస్తామని పేర్కొంది. చాలా మంది ఉద్యోగులు తమ వేతనాల నుంచి విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.