ETV Bharat / business

సంక్షోభం వేళ రాష్ట్రాలకు ఇదా తోడ్పాటు?

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ ప్రభావం భారీగా పడింది. దాదాపు ఎనిమిది వారాల లాక్‌డౌన్​తో‌ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ సమయంలో కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దాదాపు రూ.21 లక్షల కోట్ల ఉద్దీపన ద్వారా రాష్ట్రాలకు ఎంత సాంత్వన దక్కిందని ఆరా తీస్తే కలిగేది నిర్వేదమే.

Editorial on Center's Economic package for states
ఇలాంటి ఆర్థిక ప్యాకేజీతోనా రాష్ట్రాలకు తోడ్పాటు?
author img

By

Published : May 19, 2020, 8:51 AM IST

గత ఆర్థిక సంవత్సరం నుంచే గణనీయంగా రాబడులు కుంగి, కేంద్రం నుంచి తోడ్పాటు మందగించి అగచాట్ల పాలవుతున్న రాష్ట్రాలకు కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం అక్షరాలా గాయంపై గునపం పోటు! కొవిడ్‌ నేపథ్యంలో దాదాపు ఎనిమిది వారాల లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేసి బడ్జెట్లను ఒక్కపెట్టున కూల్చేయగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం, బీదసాదల సంక్షేమం కోసం ఇంతలంతలైన వ్యయాన్ని భరించడం రాష్ట్రాల తలకు మించిన భారమైంది. కాసుల్లేకుండా కరోనాపై పోరాడేదెట్లా అని బెంగటిల్లిన రాష్ట్రాలు- కావవే వరదా అంటూ కేంద్రాన్నికెన్నో మహజర్లు సమర్పించాయి. మహమ్మారిపై పోరులో తలమునకలైన రాష్ట్రాలకు కేంద్రం లక్ష కోట్ల రూపాయల గ్రాంటు ఇవ్వాలని, ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల్ని సడలించి అదనపు రుణ స్వీకరణకు అనుమతించాలని, పదిహేనో ఆర్థిక సంఘం కేటాయింపుల్ని ముందుగా అందించి, రుణ వసూళ్లను వాయిదా వెయ్యాలని కొన్ని వారాలుగా కోరుతున్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన దాదాపు రూ.21 లక్షల కోట్ల ఉద్దీపన ద్వారా రాష్ట్రాలకు ఎంత సాంత్వన దక్కిందని ఆరా తీస్తే కలిగేది నిర్వేదమే. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్ని సడలించి రుణ స్వీకరణ వెసులుబాటును మరో రెండుశాతం పెంచడం మంచిగానే ఉన్నా, అందుకు కొన్ని షరతుల్ని నిర్ధారించడం నిర్ఘాంతపరచేదే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల నికర రుణ సేకరణ పరిమితి రూ.6.41 లక్షల కోట్లు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల్ని పూర్తి చేయగలిగితే రాష్ట్రాలకు అదనంగా వచ్చే వనరులు రూ.4.28 లక్షల కోట్లు! ఒక దేశం-ఒకే రేషన్‌ కార్డు, జిల్లా స్థాయిలో సులభతర వాణిజ్యం, విద్యుత్‌ పంపిణీ సంస్థల సంస్కరణలు, నగరపాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లు- ఈ లక్ష్యాల్లో కనీసం మూడింటిని సాధించగలిగిన రాష్ట్రాలకే అదనపు రుణ సేకరణ సాధ్యపడుతుంది. కొవిడ్‌పై పోరు నిష్ఠగా సాగాల్సిన వేళ- రాష్ట్రాలకు అందాల్సిన ‘తోడ్పాటు’ ఇదా?

వస్తు సేవల పన్నును పట్టాలకెక్కించే వేళ (2017 జులై ఒకటి) దేశార్థిక సమగ్రత కోసం సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలన్నీ ముత్యాల సరంలా కూడి వచ్చాయని ప్రధాని మోదీ ప్రస్తుతించారు. స్వతంత్రంగా పన్నుల రూపేణా వనరుల్ని సేకరించే అధికారాన్ని రాష్ట్రాలు జీఎస్‌టీ కంఠాభరణంగా మార్చి కేంద్రానికిచ్చేశాయి. రాష్ట్రాల సొంత రాబడులు 2014-‘15లో 55శాతం నుంచి నేడు 50.5శాతానికి పడిపోయాయి. కేంద్రం కంటే ఒకటిన్నర రెట్లు అధిక మొత్తం వ్యయం చేసేది రాష్ట్రాలే అయినా, కేంద్రం తూములనుంచే నిధులు పారాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక సంకటాలు ఎప్పటికప్పుడు ముమ్మరిస్తున్నాయి. పద్నాలుగో ఆర్థిక సంఘం 2015-20 నడుమ రాష్ట్రాలకు ప్రవహిస్తాయన్న నిధుల్లో ఏకంగా రూ.6.8 లక్షల కోట్ల కోతపడిందని అధ్యయనాలు చాటుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి విరుచుకుపడి రాబడి అంచనాల్ని తలకిందులు చేసేయడంతో- ఆర్‌బీఐ ఆర్థిక సాయంపై వడ్డీ విధించరాదని, కేంద్ర సంస్థలనుంచి తీసుకొన్న రుణాలను రీషెడ్యూలు చేసి, ఆ తరవాత సైతం వడ్డీ లేకుండా అసలే వసూలు చేసుకోవాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. వాటిపై మాట సాయమూ కొరవడింది! ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రాష్ట్రాల మార్కెట్‌ రుణ సేకరణ మొత్తాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.1.27 లక్షల కోట్లుగా ప్రకటించింది. పదిహేనేళ్ల కాలావధి సెక్యూరిటీలకు ఏకంగా 8.96 శాతం వడ్డీ చెల్లించాల్సి రావడం రుణాల ఊబిలో కూరుకుపోవడమేనని కేరళ తల్లడిల్లుతోంది. ద్రవ్య విధానాన్ని సరళీకరించి, మరింత కరెన్సీ ముద్రించి నేరుగా ఆర్‌బీఐ నుంచే రాష్ట్రాలు రుణాలు గ్రహించేలా చూడాలన్న సూచనకూ మన్నన కొరవడింది. దేశ భద్రత, యుద్ధ పరిస్థితులు, జాతీయ స్థాయి విపత్తులు వచ్చినప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్ని తోసిపుచ్చే ‘ఎస్కేప్‌ క్లాజ్‌’ను ప్రస్తావించిన ఎన్‌కే సింగ్‌ కమిటీ 2017లోనే కొత్త సూచనలెన్నో చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రస్తావిస్తున్న కేంద్రం రాష్ట్రాల ఆర్థిక క్లేశాల్ని విస్మరించడం ఏమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.