ETV Bharat / business

ఆర్థిక సర్వే: 2020-21 ఆర్థిక సంవత్సరం ఆశాజనకమే! - ఆర్థిక సర్వేలోని కీలక అంశాలు

బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్​లో నేడు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది కేంద్రం. 2019-20 వృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది సర్వే. రానున్న ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉండొచ్చని అంచనా వేసింది.

eco survey
ఆర్థిక సర్వే
author img

By

Published : Jan 31, 2020, 2:09 PM IST

Updated : Feb 28, 2020, 3:50 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 6 నుంచి 6.5 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.

ప్రస్తుత పరిస్థితి..

"అంతర్జాతీయంగా బలహీన వృద్ధి రేటు ప్రభావం భారత్​పై పడింది. ఆర్థిక రంగంలో నెలకొన్న సమస్యలతో పెట్టుబడులు తగ్గి దేశ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పదేళ్ల కనిష్ఠానికి తగ్గింది" అని సర్వే పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5 శాతానికి తగ్గొచ్చని.. ఇటీవలి కాలంలో ఇదే అత్యల్పంగా ఉండొచ్చని వివరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్​ మధ్య భారత వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది సర్వే.

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం..

ఉల్లి సహా ఇతర నిత్యవసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్రం ప్రయత్నాలు ఫలించలేదని సర్వే అభిప్రాయపడింది.

Last Updated : Feb 28, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.