ETV Bharat / business

బిట్​కాయిన్​పై పన్ను విధింపు ఇలా సాధ్యమే! - బిట్​కాయిన్లపై పన్ని ఎలా విధించొచ్చు

ఇటీవల క్రిప్టోకరెన్సీల వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా దేశాలు వీటితో లావాదేవీలకు అనుమతిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు బిట్​కాయిన్​లను స్వీకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ సాధ్యమేనా? వీటి ద్వారా ఆదాయం లభిస్తుంది కాబట్టి అవి పన్ను పరిధిలోకి వస్తాయా? ఒకవేళ వస్తే.. వాటిపై పన్ను ఏ ప్రాతిపదికన విధించాల్సి ఉంటుంది?

Is it possible to tax bitcoins
బిట్​కాయిన్లపై పన్ను విధింపు సాధ్యమేనా
author img

By

Published : Feb 24, 2021, 5:24 PM IST

బిట్​కాయిన్, ఇథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు కేవలం కరెన్సీలు మాత్రమే కాదని.. వీటిని ఆస్తిగా కూడా పరిగణించొచ్చని అభిప్రాయపడ్డారు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్​ చంద్ర గార్గ్.

'ట్యాక్సేషన్​ కోసం.. కచ్చితంగా క్రిప్టోకరెన్సీ స్వభావంపై ఉన్న సందేహాలను ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉంది. క్రిప్టోకరెన్సీని కమోడిటిగా భావిస్తే.. దీనికి జీఎస్​టీ మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా ఆస్తిగా పరిగణిస్తే.. దానిపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన ఆదాయాలపై పన్ను విధించే వీలుంటుంది.' అని గార్గ్ వివరించారు.

'కేవలం కరెన్సీపైన మనకు ఆదాయం రాదు. కాబట్టి దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.' అని ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఫిన్​టెక్ సంస్థ ఈపీఎస్​ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో గార్గ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు.

కరెన్సీ ఆస్తితో కలిసిపోయి ఉన్నప్పుడే సమస్య తలెత్తుతుంది అని 'ఈటీవీ భారత్' అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు గార్గ్.

"ఆస్తి.. ఆదాయంతో ముడిపడి ఉంటుంది. మీరు బిట్​కాయిన్​ను 10 వేల డాలర్ల వద్ద కొని.. 50 వేల డాలర్ల వద్ద విక్రయిస్తే. అప్పుడు మీరు 40 వేల డాలర్లు లాభం పొందినట్లు. కాబట్టి ఈ 40 వేల డాలర్లపై పన్ను విధించొచ్చు."

-సుభాశ్​ చంద్ర గార్గ్​, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి

"బిట్​కాయిన్​ సహా ఇతర క్రిప్టోకరెన్సీల క్రయ విక్రయాల ద్వారా ఆదాయం గడిస్తే.. అది షేర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయంలానే పరిగణించాల్సి వస్తుంది. వాటికి స్వల్ప, దీర్ఘ కాలంలో మూలధన లాభాలు ఉంటాయి. కాబట్టి వాటిపై పన్ను విధించొచ్చు" అని పేర్కొన్నారు.

'ఈక్విటీ షేర్లకు ఐపీఓ ద్వారా అనుమతినిచ్చినట్లే.. ప్రాథమికంగా కాయిన్ల కోసం 'ఇనీషియల్ కాయిన్ ఆఫర్​' పేరుతో అనుమతినివ్వాలి. కాయిన్లను ఈక్విటీల్లానే పరిగణించాలి. అప్పుడవి అన్ని నియంత్రణ నిబంధనలకు లోబడి లిస్ట్ అవుతాయి. వాటి ట్రేడింగ్​ కూడా సులభమవుతుంది. ప్రభుత్వం దీన్ని అమలు చేయగలిగితే.. అర్హత ఉన్న క్రిప్టోకరెన్సీలు లిస్టింగ్​కు​, ట్రేడింగ్​కు అనుమతి పొందుతాయి. అప్పుడు వాటిపై పన్ను విధించడం కూడా సులభమవుతుంది.' అని గార్గ్ అభిప్రాయపడ్డారు.

క్రిప్టోకరెన్సీల ప్రయాణం

ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బిట్​కాయిన్​. షాతోషీ నాకామోటో అనే పేరుతో కొంతమంది గ్రూప్​గా ఏర్పడి ఈ బిట్​కాయిన్​ రూపొందించారు. ఇది 2009లో వినియోగంలోకి వచ్చింది. దీని తర్వాత లిట్​కాయిన్​, ఇథేరియం, కార్డనో, పోల్కాడాట్​, బిట్​కాయిన్​ క్యాష్​, స్టెల్లార్​ సహా అనేక క్రిప్టోకరెన్సీలు పుట్టుకొచ్చాయి.

కాయిన్​ మార్కెట్​ క్యాప్​ అంచనా ప్రకారం ప్రస్తుతం 8,500 వరకు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 1.45 ట్రిలియన్​ డాలర్లు. వేల సంఖ్యలో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు వీటి ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.

ఇన్ని క్రిప్టోకరెన్సీలు ఉన్నా అందులో బిట్​కాయిన్ అగ్రస్థానంలో ఉంది. 2009లో ఇది మనుగడలోకి వచ్చినా.. 2011లో ఇది డాలర్​ మార్క్​ను అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ.. 2020 చివరి నుంచి రికార్డు స్థాయిలో పుంజుకుంటోంది. ఇటీవల జీవనకాల గరిష్ఠమైన 58,300 మార్క్​ను దాటింది. దీనితో బిట్​కాయిన్​ మార్కెట్ క్యాపిటల్​ కూడా 1 ట్రిలియన్ డాలర్ల మార్క్​పైకి చేరింది. అన్ని క్రిప్టోకరెన్సీల ఎం-క్యాప్​లో బిట్​కాయిన్​ వాటానే 60 శాతం ఉందంటే ఆశ్చర్యం కాదు.

క్రిప్టో కరెన్సీని ఎందుకు విస్మరించలేం?

ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీలు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఇందులో పెట్టుబడి పెడుతున్నాయి. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ ఇటీవల బిట్​కాయిన్​లో 1.5 బిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. దీనితో బిట్​కాయిన్ విలువ అమాంతం కొత్త రికార్డులకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, ఐరాస అనుబంధ సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీల ద్వారా విరాళాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్​, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలూ క్రిప్టోకరెన్సీని ప్రజలు లావాదేవీలకు ఉపయోగించేందుకు అనుమతిస్తున్నాయి.

అమెరికాలో రెండు పెద్ద ఆర్థిక సంస్థలు మాస్టర్​ కార్డ్​, బ్యాంక్​ ఆఫ్​ న్యూయార్క్ మిల్లాన్​ (అమెరికాలో పురాతన బ్యాంక్​)లు తమ ప్లాట్​ఫామ్​లలో బిట్​కాయిన్​ లావాదేవీలకు అనుమతులు ఇస్తూ ఇదే నెలలో నిర్ణయం తీసుకున్నాయి.

స్విస్​ కాటన్​ జుగ్ కేంద్రంగా ఉన్న కంపెనీలు, ప్రజలు బిట్​కాయిన్​ ద్వారా పన్ను చెల్లించవచ్చని స్విస్​ అధికారులు ఇటీవలే ప్రకటించారు.

భారత్​లో క్రిప్టోకరెన్సీ మాటేమిటి?

భారత బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ ప్రైవేటు డిజిటల్​ కరెన్సీలకు పూర్తి వ్యతిరేకం. 2018 ఏప్రిల్​ 6న దేశంలో క్రిప్టోకరెన్సీల వినియోగం చట్టబద్ధం కాదని ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఆర్​బీఐ నిర్ణయాన్ని తప్పుబడుతూ 2020 మార్చిలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది.

భారత్​లో ఇప్పుడు క్రిప్టోకరెన్సీల వినియోగం చట్టబద్ధమే. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. క్రిప్టోకరెన్సీ నియంత్రణకు విధివిధానాలు రూపొందించాలని 2019 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాబట్టి, క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా ఉండటం ముఖ్యం. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.

త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు

సుప్రీంకోర్టు తీర్పుతో ప్రైవేటు డిజిటల్​ కరెన్సీలను నియంత్రించేందుకు కావాల్సిన బిల్లును పార్లమెంట్​ ముందుకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ విషయంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​ కూడా అధికారికంగా స్పందించారు. రెండు అత్యున్నత గ్రూప్​లు క్రిప్టోకరెన్సీ నియంత్రణ సహా ఇతర అంశాలకు సంబంధించిన నివేదిక సిద్ధం చేసినట్లు 'ఈటీవీ భారత్​'తో చెప్పారు. ఆ నివేదికలను త్వరలో క్యాబినెట్​ ముందు ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ఈ బిల్లును కేబినెట్ ఆమోదం లభిస్తే.. దానిని పార్లమెంట్​ ముందుకు తీసుకువచ్చే అవకాశముందని ఠాకూర్ వివరించారు. దీనితో దేశంలో క్రిప్టోకరెన్సీపై పూర్తి నియంత్రణకు వీలు కలుగుతుందని తెలిపారు.

క్రిప్టో కరెన్సీతో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, అధికారిక క్రిప్టోకరెన్సీని విడుదల చేయాలా లేదంటే ప్రైవేటు సంస్థలను అనుమతించాలా అనే విషయపై వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ఠాకూర్​ పేర్కొన్నారు.

క్రిప్టోకరెన్సీపై పన్ను విధిస్తారా? అన్న ప్రశ్నకు.. వాటన్నింటికి బిల్లులో కచ్చితమైన సమాధానముంటుందని వివరించారు.

ఇదీ చదవండి:బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.