కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ నడుమ.. దేశ ఎగుమతులు రికార్డుస్థాయిలో పడిపోయినట్లు వాణిజ్యశాఖ తెలిపింది. ఏప్రిల్లో 60.28 శాతం తగ్గి.. ఎగుమతుల విలువ రూ.64 వేల కోట్ల (10.36 బిలియన్ల డాలర్లు)కు పరిమితమైనట్లు శుక్రవారం వెల్లడించింది.
వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం దిగుమతులు కూడా 58.65 శాతం తగ్గి 17.12 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్లో దిగుమతుల విలువ 41.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో వాణిజ్యలోటు 15.11 బిలియన్ డాలర్లు కాగా.. ఈ సారి 6.76 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఆ ఎగుమతుల్లో క్షీణత...
- రత్నాలు, ఆభరణాల్లో -98.74 శాతం క్షీణత
- పెట్రోలియం ఉత్పత్తులు -66.22 శాతం తగ్గుదల
- ఇంజనీరింగ్ పరికరాలు -64.76 శాతం
ఏప్రిల్లో చమురు దిగుమతులు 4.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. 59.03 శాతం తక్కువని వాణిజ్యశాఖ తెలిపింది.