ఆ రాష్ట్రాలకు రుణాల ద్వారా రూ.68.8 వేల కోట్లు - loans to states to meet gst shortfall
జీఎస్టీ అమలు వల్ల ఆర్థిక లోటు ఏర్పడిన 20 రాష్ట్రాలు బహిరంగ మార్కెట్‌ల నుంచి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఫలితంగా రూ.68 వేల 825 కోట్లు సంబంధిత రాష్ట్రాలు సమకూర్చుకునేందుకు వీలు కలుగుతుంది.
బహిరంగ మార్కెట్‌ల నుంచి రుణాలు తీసుకునేందుకు 20 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. దీని ద్వారా రూ.68వేల 825 కోట్లు ఆయా రాష్ట్రాలు సమకూర్చుకునేందుకు వీలు కలుగుతుంది.
జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక లోటును తీర్చడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఎంపికల్లో మొదటిది ఎంచుకున్న 20 రాష్ట్రాలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల జీఎస్డీపీ అదనంగా 0.50 శాతాన్ని బహిరంగ మార్కెట్‌లో రుణంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆప్షన్ -1 ను ఎంచుకున్న జాబితాలో ఉన్నాయి.