దేశీయంగా ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రమంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో రూ.6,322కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అమలుకు ఆమోదించింది. కోటెడ్ స్టీల్ ఉత్పత్తులు, హైస్ట్రెంత్ స్టీల్, స్పెషాలిటీ రెయిల్స్, అలాయ్ స్టీల్ వస్తువులు, స్టీల్ వైర్లు, ఎలక్ట్రికల్ స్టీల్ వంటి విభాగాలకు ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
"ఉక్కు దిగుమతులను తగ్గించి, మన సొంత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రూ.6,322 కోట్లతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వల్ల ఉక్కు తయారీకి ఊతం లభిస్తుంది. దిగుమతులు తగ్గుతాయి. 5.25 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం లభిస్తుంది. సుమారు రూ.39,600 కోట్ల పెట్టుబడుల వచ్చే అవకాశముంది."
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి
మరోవైపు.. లద్దాఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లద్దాఖ్ సమగ్ర మౌలికవతుల అభివృద్ధి సంస్థ(ఎల్ఐఐడీసీఓ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
ఇదీ చూడండి: ఆగని విపక్ష ఆందోళనలు- పార్లమెంట్లో వాయిదాల పర్వం