ETV Bharat / business

పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

నేడు కేంద్రం పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది..? రైతుల కోసం ఏం చేస్తుంది..? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు.

budget-2020
పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?
author img

By

Published : Feb 1, 2020, 5:25 AM IST

Updated : Feb 28, 2020, 5:53 PM IST

పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఈ రోజు బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. క్రితం సారి సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి ఎలా వస్తారని ఆసక్తి నెలకొంది.

అయితే.. బడ్జెట్​ ప్రతులు తెచ్చే ఈ సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్​కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసా...?

ఫ్రెంచ్​ నుంచి వాడుకలోకి...

బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​.

1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

నలుపు నుంచి..

భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే శన్ముఖమ్​ చెట్టీ 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.

1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు.

1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

1970ల తర్వాతే..

ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా.. ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో వచ్చారు.

మన్మోహన్​ సింగ్​.. బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు.

ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా... చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా నిలిచారు.

బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో.. సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం.

మోదీ-1 హయాంలో.. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు.
2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు.

2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.

ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్​ సమయంలో సూట్‌కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్ధిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చారు.

ఈ రోజు బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... మళ్లీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఏ రకంగా పార్లమెంటులో అడుగుపెడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ZCZC
PRI ECO NAT NRG
.JAIPUR NRG23
RJ-BANK-STRIKE
Banking services hit as employees go on strike in Rajasthan
Jaipur, Jan 31 (PTI) Banking services were hit in Rajasthan as employee unions went on a two-day nationwide strike from Friday to press for wage revision and other demands.
          Leaders of bank unions claimed that around 30,000 employees and officials in the state remained on strike.
In support of the nationwide bank strike, hundreds of bank personnel in the state capital gathered in front of Allahabad Bank near Ambedkar Circle to lodge a protest.
The key demands of banking employees include early settlement of salaries, five-day week working in banks, special allowances to be added to basic salary, pension reforms, hike in family pension, income tax on all the benefits of retirement besides others.
State Convener of United Forum of Bank Unions and leader of All India Bank Employees Association claimed in a statement that the strike affected the turnover of Rs 10,000 crore in the state and around 30,000 employees and officials protested to press for their demands.
He said that a memorandum was submitted to the Secretary to the Governor regarding various demands of the employees.
          Mishra said that the striking workers will gather in front of Allahabad Bank at 1030 hrs on Saturday where demonstrations and meetings will be held. PTI AG
MR
MR
01312146
NNNN
Last Updated : Feb 28, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.