సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎఈలకు) బ్యాంకుల ద్వారా జూన్ 20 నాటికి మొత్తం రూ.79,000 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక రుణ లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది.
ఇప్పటికే రూ.35 వేల కోట్లకుపైగా మొత్తాన్ని లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది ఆర్థిక శాఖ. మొత్తం 19 లక్షల ఎంఎస్ఎంఈలు, ఇతర వ్యాపారాలు ఈ రుణాలను పొందినట్లు వివరించింది.
ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా..
లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్ భారత్' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఎంఎస్ఎంఈలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు జూన్ 1 నుంచి రుణాలు ఇస్తున్నాయి.