ETV Bharat / business

'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్​కు 7% నిధులే' - ఆరోగ్య రంగంపై సమాచార హక్కు చట్టం వాదనలు

ఆయుష్మాన్​ భారత్​ యోజన అమలు కోసం కేంద్రం బడ్జెట్​లో భారీ స్థాయిలో కేటాయింపులు జరిపినా.. చెల్లింపులు మాత్రం అంతంతమాత్రమేనని సహ చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. గత నాలుగేళ్లలో రూ.21,360కోట్లకుగాను... జాతీయ ఆరోగ్య సంస్థకు రూ.1,540 కోట్లు మాత్రమే అందాయని తెలిసింది.

Ayushman Bharat Scheme : Only 7 percent fund made available so far
నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్​కు 7 శాతం నిధులే!
author img

By

Published : Jun 3, 2021, 4:04 PM IST

ఆయుష్మాన్ భారత్​ యోజన అమలు కోసం జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఏ)కు రూ.21,360 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంజూరు చేసినప్పటికీ.. గత నాలుగేళ్లలో రూ.1,540 కోట్లు(7.2 శాతం) మాత్రమే చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన ప్రఫుల్ సర్దా అనే వ్యక్తి చేసుకున్న దరఖాస్తుకు కేంద్రం ఈమేరకు సమాధానం ఇచ్చింది.

"2018-19లో రూ.2,160 కోట్లు, 2019-20, 20-21, 21-22 ఆర్థిక సంవత్సరాలకు రూ.6,400 కోట్లు చొప్పున కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. అయితే.. గత నాలుగేళ్లలో ఎన్​హెచ్​ఏకు ఇప్పటివరకు రూ.1,540 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా.. ఆరోగ్య శాఖకు ఏటా రూ.385 కోట్లు మాత్రమే ఆర్థిక శాఖ అందిస్తోంది." అని ప్రఫుల్​ తెలిపారు.

ఇదీ చదవండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

ఇదీ చదవండి: వైద్య సేవలకేదీ కొత్త ఊపిరి?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్లక్ష్యం వల్లే ఆరోగ్య రంగానికి కేవలం 7.20 శాతం నిధులు అందాయని ప్రఫుల్ సర్దా ఆరోపించారు. పూర్తిస్థాయిలో విడుదల అయి ఉంటే.. కరోనా వైరస్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కావలసిన నిధులు అందుబాటులో ఉండేవని తెలిపారు.

ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ప్రతిష్టాత్మకమైనవి. కానీ పనికిరాకుండా మారిపోతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలి. తన తప్పును ఆర్థిక మంత్రి అంగీకరించాలి.

-ప్రఫుల్ సర్దా, ఆర్టీఐ కార్యకర్త

ఇవీ చదవండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

వైద్య సేవలకేదీ కొత్త ఊపిరి?

జనారోగ్యంతోనే 'ఆత్మనిర్భర్‌'

మౌలిక సౌకర్యాల కొరతతో 'ఆరోగ్య రంగం' ఆపసోపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.