ETV Bharat / business

కేంద్రానికి షాక్‌!.. తగ్గనున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయం - మోదీ సర్కారుకు మరో షాక్‌

ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో కేంద్ర ప్రభుత్వానికి మరో షాక్​ తగలబోతోంది. ప్రత్యక్ష పన్నుల ఆదాయం భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.13.5 లక్షల కోట్లు సమీకరించాలన్నది గత బడ్జెట్​లో లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే మార్చి 31 నాటికి ఇందులో 23 శాతం తక్కువే సమకూరుతుందని ఆర్థిక శాఖ సీనియర్​ అధికారులు అంచనా వేస్తున్నారు.

direct tax revenues
మోదీ సర్కారుకు మరో షాక్‌
author img

By

Published : Jan 25, 2020, 7:55 AM IST

Updated : Feb 18, 2020, 8:08 AM IST

ప్రభుత్వాలకు అధికంగా ఆదాయం వచ్చేది పన్నుల రూపంలోనే. ఏటా ఈ ఆదాయ అంచనాలను పెంచుకుంటూ వెళ్తుంటారు. ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూపేణ మరో షాక్‌ తగలబోతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.13.5 లక్షల కోట్లు సమీకరించాలన్నది గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే మార్చి 31 నాటికి ఇందులో 23 శాతం తక్కువే సమకూరుతుందని ఆర్థికశాఖ సీనియర్‌ అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులను కలిపి ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తుంటారు. ఈ పన్ను ఆదాయం తగ్గనుండటం, రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారని పలువురు సీనియర్‌ అధికారులు తెలిపినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది.

ఇవీ కారణాలు

కార్పొరేట్‌ పన్ను రేట్లను తగించడానికి తోడు, ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. తయారీ కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించేందుకే కార్పొరేట్‌ పన్ను రేట్లు తగ్గించారు.

ప్రజల కొనుగోళ్లు తగ్గడంతో, వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇందువల్ల కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టకపోగా, ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5 శాతానికి పరిమితమవుతుందని, ఇది 11 ఏళ్ల కనిష్ఠస్థాయి అని ప్రభుత్వమే ప్రకటించాల్సి వచ్చింది.

ఇప్పటివరకు రూ.7.3 లక్షల కోట్లే

ఈనెల 23 వరకు ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల రూపేణ సమకూరిన మొత్తం రూ.7.3 లక్షల కోట్లు మాత్రమేనని సమాచారం. గతేడాది ఇదే సమయానికి ఆర్జించిన మొత్తం కంటే ఇది 5.5 శాతం తక్కువ. ఇంకా మిగిలిన కాలంలో ఎంతగా ప్రయత్నించినా, ఈ మొత్తం 2018-19 పన్ను ఆదాయమైన రూ.11.5 లక్షల కోట్ల కంటే, 10 శాతం వరకు తక్కువే ఉండొచ్చన్నది సీనియర్‌ అధికారుల మాట. ప్రత్యక్ష పన్నుల ఆదాయం తగ్గనుండటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గతేడాది స్థాయిలో పన్ను ఆదాయం సమకూరినా, ఎంతో సంతోషిస్తామని అంటున్నారు.

సమకూరేది ఇలా

తొలి 3 త్రైమాసికాల్లో కంపెనీల నుంచి ముందస్తుగా కార్పొరేట్‌ పన్నును వసూలు చేస్తుంటారు. ఇక ఆఖరి త్రైమాసికంలో అయితే, ఏడాది మొత్తం వసూలయ్యే పన్ను ఆదాయంలో 30-35 శాతాన్ని సమీకరిస్తున్నారని గత మూడేళ్ల గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వార్షిక ఆదాయ అంచనాల్లో 80% వరకు ప్రత్యక్ష పన్నులదే ఉంటుంది. ఇదే తగ్గితే, వ్యయాల కోసం, ప్రభుత్వం మరింత రుణం చేయాల్సి వస్తుంది.

ఇదీ చూడండి: పద్దు​ 2020: ఖర్చు ఎక్కువే చేయాలి.. కానీ సరైన మార్గంలో

ZCZC
URG GEN LGL NAT
.NAGPUR BOM16
MH-CJI-AI
AI would not substitute human decision-making in courts: CJI
         Nagpur, Dec 14 (PTI) Chief Justice of India Sharad
Bobde said on Saturday that there was no plan to use
Artificial Intelligence (AI) technology in the decision-making
process in the courts.
         Justice Bobde, who was felicitated at a function
organized by the High Court Bar Association here, made the
clarification after former CJI R M Lodha expressed concern
about the use of AI.
         "The idea is good and may help significantly in
management of cases in courts and discharge of judicial
functions. But, like other technological innovations such use
may have potential negative implications," Justice Lodha said
in his speech.
         His request to the CJI was that all pros and cons must
be carefully weighed before AI is used in judicial decision-
making, he said.
         Replying to his concerns, the CJI said in his speech,
"I wish to point out that it is not an attempt to introduce
artificial intelligence in decision-making process itself.
         "The system we are looking at has a reading speed of
about ten lakh words per second. Which means you can make it
read anything and ask it any question, it will give you the
answer," he said.
         "...Ayodhya case had thousands of documents, thousands
of pages of documents and that becomes very easy when you
employ artificial intelligence. There is no thought of
substituting the judicial decision-making process of human
mind," he assured.
         "As somebody said, we are not planning to provide for
an appeal from `single computer' to `bench of three
computers', that is not going to happen," the CJI added. PTI
CLS
KRK
KRK
12142334
NNNN
Last Updated : Feb 18, 2020, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.