ETV Bharat / business

2021-22లో భారత వృద్ధి రేటు 10 శాతమే: ఏడీబీ - చైనా వృద్ధి రేటుపై ఏడీబీ నివేదిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ (India GDP Forecast) 10 శాతం వృద్ధి రేటును సాధించొచ్చని ఏషియన్ డెవలప్​మెంట్​ బ్యాంక్ అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ 2021లో 8.1 వృద్ధి (China Growth Forecast) రేటును నమోదు చేయొచ్చని తెలిపింది.

ADB on Indian Growth Forecast
భారత వృద్ధి రేటుపై ఏడీబీ అంచనాలు
author img

By

Published : Sep 22, 2021, 12:50 PM IST

భారత వృద్ధి రేటు అంచనాలను దిగువకు సవరించింది ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంక్ (ఏడీబీ). 2021-22లో దేశ వృద్ధి రేటు 10 శాతంగా నమోదయ్యే అవకాశముందని తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఇంతకు ముందు ఈ అంచనా 11 శాతంగా ఉండటం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది.

ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన కొవిడ్​ రెండో దశ.. భారత వృద్ధి రేటు రికవరీ వేగాన్ని అడ్డుకున్నట్లు వివరించింది ఏడీబీ. దీని ప్రభావం అధికంగా ఉంటుందని భావించినప్పటికీ.. పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ ఎత్తేయడం, ఆంక్షలను సడలించడం వల్ల దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆసియాలో బలమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా చైనానే కొనసాగుతున్నట్లు ఏడీబీ నివేదిక పేర్కొంది. ఆ దేశం 2021లో 8.1 శాతం వృద్ధి రేటును సాధించే వీలుందని అంచనా వేసింది. 2022లో చైనా వృద్ధి రేటు 5.5 శాతానికి తగ్గొచ్చని వివరించింది.

ఇదీ చదవండి: సోనీ ఇండియాతో జీ ఎంటర్​టైన్మెంట్ విలీన ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.