రాబోయే ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను నిష్పత్తిపై రూపొందించిన 15వ ఆర్థిక సంఘం తన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించారు సంఘం సభ్యులు. 'ఫినాన్స్ కమిషన్ ఇన్ కొవిడ్ టైమ్స్' పేరిట రూపొందించిన ఈ నివేదికను 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ సహా ఇతర సభ్యులు సీతారామన్‌ను నేరుగా కలిసి అందజేశారు.
సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి, నవంబర్ 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తొలి నివేదిక సమర్పించింది ఆర్థిక సంఘం.
2021-22 నుంచి 2025-26 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీపై నివేదికను రూపొందించింది ఆర్థిక సంఘం. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ద్వారా వివరణాత్మక నివేదికను రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రులకు సమర్పించింది.
14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు మొత్తం పన్నుల్లో 42శాతం ఇవ్వమని సిఫారసు చేయగా.. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు రూ.8 లక్షల 55 వేల 176 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది.
పార్లమెంటు ఆమోదం తరువాత 15వ ఆర్థిక నివేదిక పూర్తి వివరాలను బహిర్గతం చేయనుంది ప్రభుత్వం.
ఇదీ చూడండి:ప్రధాని చేతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక