ETV Bharat / business

చిన్న రుణాలా.. కొన్నాళ్లు చూద్దాంలే - మొండిబకాయిలు

ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కుతెచ్చిపెట్టింది కొవిడ్​ మహమ్మారి. చిన్న రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవు. ఒకవేళ ఇచ్చినా మొండిబకాయిల సమస్య వెంటాడుతుందన్న భయాందోళనలు చుట్టుముట్టాయి. కొవిడ్​ ప్రభావంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఈ మేరకు ట్రాన్స్​యూనియన్​ సిబిల్​ నివేదిక వెల్లడించింది.

YOU WANT Small loanS .. Let's see some years
చిన్న రుణాలా.. కొన్నాళ్లు చూద్దాంలే
author img

By

Published : Jun 12, 2020, 7:25 AM IST

కొవిడ్‌-19 సంక్షోభం దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక పక్క నగదు లభ్యత మెరుగ్గా ఉన్నప్పటికీ.. చిన్న రుణాల విషయంలో బ్యాంకులు దూకుడుగా వెళ్లలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు ఇస్తే.. మొండి బకాయిల సమస్య పెరగొచ్చని బ్యాంకులు భయపడుతున్నట్లు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ.. రుణదాతలు ఈ విభాగాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలే ఇందుకు కారణమని పేర్కొంది.

రిటైల్‌ రుణాల వృద్ధి కోసం బ్యాంకులు నష్టభయం తక్కువగా ఉండే గృహ రుణాల వైపు మొగ్గుచూపుతున్నాయి. అయితే గృహాలు అందుబాటు ధరలో లేకపోవడం, ఆర్థిక పరిస్థితులతో కొనుగోలుదార్లు వాయిదా వేసుకోవడం వంటి కారణాలతో ఈ రుణాలకు గిరాకీ భారీగా తగ్గనుందని సిబిల్‌ అభిప్రాయపడింది. 2008-09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులను, తాజా ఆర్థిక గణాంకాల అంచనాలను విశ్లేషించిన సంస్థ.. నివేదిక వెలువరించింది.

రుణాల తీరే మారుతోంది..

'భారత ప్రభుత్వం కొవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. అయితే వీటి ప్రభావం అంతంతమాత్రమే. దీని వల్ల మొత్తం రిటైల్‌ రుణాల మార్కెట్‌ తీరుతెన్నులు మారిపోవడానికి దారితీయొచ్చు' అని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌, కన్సల్టింగ్‌) అభయ్‌ కేల్కర్‌ పేర్కొన్నారు.

కొవిడ్‌ తర్వాత వినియోగదారుల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయాయని, ఎక్కువ శాతం మంది వేతన కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం చవిచూస్తున్నారని నివేదిక పేర్కొంది. ఫలితంగా వినియోగదారు సెంటిమెంట్‌ దెబ్బతిందని, గిరాకీ, వ్యయాలపై ప్రభావం పడిందని చెప్పుకొచ్చింది. భవిష్యత్‌లో రిటైల్‌ రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యతపై సైతం ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. భద్రత లేని రుణాల ఆస్తుల నాణ్యత దారుణంగా తగ్గొచ్చని విశ్లేషించింది. మారటోరియం ముగిసిన తర్వాత కూడా కొంత మంది రుణగ్రహీతలు వాయిదాలు చెల్లించలేకపోవచ్చని, ఇది వారి స్కోర్లపై ప్రభావం చూపుతుందని, డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు పెరుగుతాయని సిబిల్‌ వివరించింది. క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గృహ, వాహన రుణాల ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉండొచ్చని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.