ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ వివాదం: ఈడీ ఎదుట అనిల్ అంబానీ

author img

By

Published : Mar 19, 2020, 10:51 AM IST

ఎస్​ బ్యాంక్ వివాదం నేపథ్యంలో ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్​ అనిల్ అంబానీ. ఎస్​ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్ మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల 16న అనిల్​కు ఈడీ సమన్లు జారీ చేసింది.

anil ambani case
ఈడీ ఎదుట అనిల్ అంబానీ

ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్‌ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్‌ అంబానీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ..ఈ నెల 16న అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మినహాయింపునివ్వాలని అనిల్ అంబానీ కోరగా ఇవాళ హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ ఈడీ ఎదుట ఇవాళ విచారణకు హాజరయ్యారు.

ఎస్‌ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు సుమారు రూ.12,800 కోట్ల రుణాలను పొందాయి. సకాలంలో చెల్లించని కారణంగా అవి నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు అనిల్ అంబానీకి సమన్లు జారీ చేశారు.

ఇదీ చూడండి:టిక్‌..టిక్‌.. టిక్‌.. మాంద్యంలోకి జారుకుంటున్నామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.