భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను షియోమీ శాసిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం కారణంగా షియోమీ ఫోన్లకు డిమాండ్ భారీగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో షియోమీ 23.6 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. ఈ గణాంకాలు చూస్తే.. షియోమీకి ఉన్న ఆదరణ అర్థమవుతుంది.
ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదార్లను ఆకర్షిస్తోంది షియోమీ. ఇందులో భాగంగా జూలై4న మరో బడ్జెట్ ఫోన్ 'రెడ్మీ7ఏ'ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.
ఈ మేరకు షామీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 'రెడ్ మీ 7ఏ'లో వాడిన ప్రాసెసర్‌ను ఆయన హైలెట్ చేశారు.
కొన్ని అంతర్జాతీయ టెక్ మార్కెట్ల ప్రకారం 'రెడ్మీ 7ఏ'లో క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 439-ఆక్టా కోర్ ప్రాసెసర్ వాడినట్లు తెలుస్తోంది.
'రెడ్ మీ 7ఏ'లో ప్రధాన ఫీచర్లు
- 5.4 అంగుళాల తాకే తెర.. హెచ్డీ+
- వెనుక వైపు 13 మెగా పిక్సల్ కెమెరా
- ముందువైపు 5 మెగా పిక్సల్ కెమెరా
- ఆండ్రాయిడ్ 9పై తో పనిచేసే ఎంఐయూఐ 10 ఆపరేటింగ్ సిస్టమ్
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇదీ చూడండి: భానుడి భగభగలకు 8కోట్ల మంది శ్రమ ఆవిరి