టెక్నాలజీ పుణ్యాన రవాణా వ్యవస్థలో క్యాబ్‌లు ఇప్పుడు కీలకంగా మారాయి. నగరాల్లో క్యాబ్‌లకు యమా డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ టాక్సీ సేవలు ఏ ధరకు లభిస్తున్నాయో అధ్యయనం చేసింది టాక్సీ2ఎయిర్పోర్ట్.కామ్. ఈ లెక్కలు తెలుసుకునేందుకు టాక్సీ-కాలిక్యులేటర్.కామ్ డేటాను విశ్లేషించింది.
1. ఈజిప్ట్
ఈజిప్ట్‌లో టాక్సీ ధరలు నియంత్రణలో ఉన్నాయి. ఇక్కడ 5 కిలోమీటర్ల ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 66 (0.84 యూరోలు) వసూలుచేస్తారు. కనీస ధర 0.24 యూరోలు మాత్రమే కావడం గమనార్హం.
2. భారతదేశం
భారతదేశంలో 5 కిలోమీటర్ల క్యాబ్ ప్రయాణానికి సుమారు రూ. 102 వసూలు చేస్తారు. ముంబయి, దిల్లీ వంటి నగరాల్లోనే ఇది అధికంగా ఉంటుంది.
3. థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లో 5 కి.మీ. దూరం వెళ్లడానికి రూ.112 (1.41 యూరోలు) చెల్లించాల్సి ఉంటుంది. 5 కి.మీ. క్యాబ్ ప్రయాణానికి ఇది తగిన ధర అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
4. జర్మనీ
జర్మన్ వీధుల్లో 5కి.మీ. క్యాబ్‌లలో తిరగాలంటే 13.80 యూరోలు వసూలు చేస్తారు.
5. జపాన్
స్విట్జర్లాండ్ తర్వాత క్యాబ్ ప్రయాణాలకు ఎక్కువ ధర వసూలుచేస్తున్న దేశం జపాన్. ఇక్కడ 5 కిలోమీటర్ల ప్రయాణానికి ధర రూ. 1180 (15.64యూరోలు) చెల్లించాలి.
6. స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌లో క్యాబ్ ప్రయాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ క్యాబ్‌లో వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. 5 కి.మీ. దూరానికి క్యాబ్‌కు రూ. 1800(22.68) వెచ్చించాల్సిందే.