దిగ్గజ మొబైల్ సంస్థలకు పోటీగా అత్యాధునిక ఫీచర్లతో 'ఎంఐ' మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి... మొబైల్ రంగంలోనే విప్లవం సృష్టించింది షియోమీ. యాపిల్, వన్‌ప్లస్ వంటి ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లతో... ఎంఐ మొబైల్స్‌ను తయారు చేసి, అతి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించింది. అలాంటి సంస్థ తొలిసారి ల్యాప్‌టాప్‌లతో భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఆ ఉత్పత్తులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎంఐ నోట్‌బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను.. జూన్ 11, మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నారు సంస్థ ప్రతినిధులు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే తేదీని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
-
Get ready to experience the Epic wherever you ARe.
— Mi India (@XiaomiIndia) June 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Mi fans, we know you would love to experience the #MiNoteBook, and we are ensuring that without the need of you stepping out of your house.
Watch the Livestream on June 11 from 12NOON to know more.#MakeEpicHappen pic.twitter.com/oME3kdDByj
">Get ready to experience the Epic wherever you ARe.
— Mi India (@XiaomiIndia) June 9, 2020
Mi fans, we know you would love to experience the #MiNoteBook, and we are ensuring that without the need of you stepping out of your house.
Watch the Livestream on June 11 from 12NOON to know more.#MakeEpicHappen pic.twitter.com/oME3kdDByjGet ready to experience the Epic wherever you ARe.
— Mi India (@XiaomiIndia) June 9, 2020
Mi fans, we know you would love to experience the #MiNoteBook, and we are ensuring that without the need of you stepping out of your house.
Watch the Livestream on June 11 from 12NOON to know more.#MakeEpicHappen pic.twitter.com/oME3kdDByj
నోట్‌బుక్‌తో పాటు..
ఎంఐ నోట్‌బుక్ మోడల్ ఫొటోను షియోమీ ఇండియా మేనెేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ విడుదల చేశారు. జూన్ 11న ఎంఐ నోట్‌బుక్ మోడల్‌తో పాటు, షియోమీ ఎంఐ నోట్‌బుక్ 'హారిజోన్' ఎడిషన్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.
ఫీచర్లు ఇవే!
- ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్(10వ జనరేషన్)
- 12 గంటల బ్యాటరీ సామర్థ్యం
- 14 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్
- డీటీఎస్ ఆడియో సపోర్ట్
- ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్
ఇదీ చూడండి: ఐటీఆర్-1 ఫారంతో రిటర్నుల దాఖలు ఇలా...