ఐటీ దిగ్గజం 'విప్రో' మార్చి 31తో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ. 2,493.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ. 1,800.8 కోట్లు.
గడచిన ఆర్థిక సంవత్సరం సంస్థ మొత్తం ఆదాయం రూ. 15,006.3 కోట్లుగా ఉండగా... అంతక్రితం ఆర్థిక సంవత్సరం రూ. 13,768.6 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
బై బ్యాక్‌కు బోర్డు ఆమోదం
సంస్థ లాభాలు సానుకూలంగా ఉన్నందున రూ. 10,500 కోట్లతో దాదాపు 32.3 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమైంది విప్రో. ఇందుకు సంస్థ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఒక్కో షేర్‌కు రూ. 325 చొప్పున బైబ్యాక్ చేయనున్నట్లు విప్రో పేర్కొంది.
డాటా చౌర్యం
కొందరు ఉద్యోగులకు చెందిన ఖాతాలు ఫిషింగ్‌కు గురైనట్లు విప్రో ప్రకటించింది. కంపెనీలో పలు అనుమానిత కార్యకలాపాలు జరిగినట్లు భావిస్తన్నామని... వెంటనే విచారణకు అదేశించినట్లు ఐటీ దిగ్గజం పేర్కొంది. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లో విప్రో షేర్లు కుప్పకూలాయి. సెన్సెక్స్‌లో సంస్థ షేరు 2.5 శాతం నష్టపోయి... రూ. 278.10 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో 2.12 శాతం నష్టంతో రూ. 281.60 వద్ద ముగిసింది.