ETV Bharat / business

క్యూ2లో లాభం తగ్గినా.. విప్రో భారీ బై బ్యాక్ ప్లాన్​ - విప్రో లేటెస్ట్ న్యూస్

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2020-21 క్యూ2 నికర లాభం 3.4 శాతం తగ్గి.. రూ.2,465 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నికర లాభం రూ.2,552.7 కోట్లుగా ఉంది. లాభం తగ్గినా.. ప్రస్తుత షేరు ధర కన్నా 6.4 శాతం అధిక మొత్తానికి.. రూ.9,500 కోట్లతో బై బ్యాక్​ను ప్రకటించింది.

wipro profits in second Quarter
రెండో త్రైమాసికంలో విప్రో లాభాలు
author img

By

Published : Oct 13, 2020, 5:00 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. దేశీయ ఐటీ​ దిగ్గజం 'విప్రో' రూ.2,465.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2019-20 క్యూ2లో నమోదైన రూ.2,552.7 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 3.4 శాతం తక్కువ.

2020-21 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం మాత్రం.. గత అర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రూ.15,114.5 కోట్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

భారీ బైబ్యాక్..

నికర లాభం తగ్గినప్పటికీ.. రూ.9,500 కోట్లతో షేర్ల బై బ్యాక్​ ప్లాన్​కు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరును రూ.400తో బై బ్యాక్ చేయాలని నిర్ణయించింది. విప్రో ప్రస్తుత షేరు ధర (రూ.375.5)తో పోలిస్తే.. బై బ్యాక్​ ధర 6.4 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:పసిడి ధరల జోరుకు బ్రేక్- నేడు ఎంత తగ్గిందంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.