ETV Bharat / business

స్వదేశీ X విదేశీ: ఈ-కామర్స్ వార్​లో గెలుపెవరిది?

ఈ-కామర్స్​ వ్యాపారాలకు ఇటీవల ఆదరణ​ విపరీతంగా పెరుగుతోంది. సంస్థల మధ్య పోటీ కూడా తీవ్రమవుతోంది. ఈ రేసులో పలు దేశీయ, విదేశీ కంపెనీలు ప్రధానంగా ఉన్నాయి. మరి.. రానున్న రోజుల్లో ఈ-కామర్స్ వ్యాపారాల్లో విదేశీ దిగ్గజ కంపెనీలను భారతీయ కంపెనీలు ఎదుర్కోగలవా?

E comm race in Indian market
ఈ కామర్స్ విభాగంలో దేశీయ కంపెనీలే సానుకూలం
author img

By

Published : Mar 21, 2021, 1:29 PM IST

భారత​ ఈ-కామర్స్​ మార్కెట్​లో రోజురోజుకు పోటీతత్వం తీవ్రమవుతోంది. అయినప్పటికీ భారతీయ కంపెనీలు.. విదేశీ కంపెనీల పోటీని తట్టుకుని(కార్యకలాపాలు, సుస్థిరత్వం విషయంలో).. ముందుకు సాగే అవకాశాలున్నాయని ఈ-కామర్స్ మార్కెట్ విశ్లేషకులు కిరణ్​ పేడాడ అంటున్నారు. హైదరాబాద్​ ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ (ఐఎస్​బీ)లో కిరణ్​ మార్కెటింగ్​ విభాగ అసిస్టెంట్​ ప్రొఫెసర్​.

అమెజాన్, వాల్​మార్ట్​ లాంటి దిగ్గజ బహుళజాతీయ సంస్థలకూ భారత మార్కెట్​లో పోటీని తట్టుకోవడం అంత సులువేం కాదని.. కిరణ్​ 'ఈటీవీ భారత్​'తో చెప్పారు. ఆయా కంపెనీలకు ఎంతో అనుభవమున్నప్పటికీ.. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్​లో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు.

'ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. దీని వల్ల విదేశీ కంపెనీలకు భాష, లాజిస్టిక్స్, మౌలికవసతులు సహా అనేక విషయాల్లో సవాళ్లు ఎదురు కావచ్చు' అని కిరణ్​ వివరించారు. దేశీయ కంపెనీలకు మాత్రం ఇది కలిసివచ్చే అంశమని చెప్పుకొచ్చారు​. రిలయన్స్, టాటా వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఎన్నో దశాబ్దాలుగా తమ వ్యాపారాలు సాగిస్తుండటమే ఇందుకు కారణమన్నారు.

టాటా కొత్త ఈ-కామర్స్ యాప్​!

టాటా గ్రూప్​ ఇటీవల ఈ-గ్రోసరీ విభాగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ వ్యాపారాల్లో తీవ్ర పోటీకి తెరలేపినట్లు వస్తున్న వార్తలకు.. కిరణ్​ విశ్లేషణతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ.. బిగ్​ బాస్కెట్​లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికకు అనుమతి కోరుతూ కాంపిటీషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి గత వారం దరఖాస్తు చేసుకుంది టాటా గ్రూప్​. దీనితో పాటు టాటా డిజిటల్​ లిమిటెడ్ నుంచి త్వరలో సరికొత్త ఈ కామర్స్​ యాప్​ రానున్నట్లు వార్తలొస్తున్నాయి.

భారత్​లో ఈ-కామర్స్​ కంపెనీలు

ప్రస్తుతం భారత ఈ-కామర్స్ విభాగంలో అమెజాన్​(అమెరికాకు చెందిన అమెజాన్ ఇంక్ దీని మాతృసంస్థ), ఫ్లిప్​కార్ట్(అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ దీని మాతృసంస్థ), భారతీయ కంపెనీ జియో మార్ట్​ (ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్​ అనుబంధ సంస్థ) ప్రధానంగా ఉన్నాయి.

ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్​లో అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్​లైన్ రిటైల్ మార్కెట్లో వాల్​మార్ట్​ ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం.

పాలసీల అడ్డంకులకు..

ప్రస్తుతమున్న పాలసీలు, నిబంధనలు కూడా విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు అంత అనుకూలమైనవేం కాదని కిరణ్ అభిప్రాయపడ్డారు.

"దేశంలో ఇప్పుడు రెండు ఈ-కామర్స్ విధానాలు ఉన్నాయి. ఒకటి మార్కెట్ ​ప్లేస్​ విధానం, రెండోది ఇన్​వెన్టరీ విధానం. మార్కెట్ ప్లేస్ విధానం 100 శాతం ఎఫ్​డీఐకు అనుమతిస్తుంటే.. రెండో విధానంలో అందుకు అనుమతి లేదు. ఇదే విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు ప్రధాన అవరోధం" అని కిరణ్ ​ పేర్కొన్నారు.

ఇన్​వెన్టరీ విధానంలో ఈ-కామర్స్​ సంస్థలు తమ సొంత ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. కొనుగోలుదారు, విక్రేతల మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది.

కొత్త ఈ-కామర్స్ పాలసీ..

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. సరికొత్త ఈ-కామర్స్ పాలసీ రూపకల్పనకు సంబంధిత వర్గాలతో వాణిజ్యమంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దేశంలో ఈ-కామర్స్ రంగానికి ఏకీకృత పాలసీ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఆదాయపు పన్ను చట్టం 1961, వినియోగదారు హక్కుల రక్షణ చట్టం 2019, ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ చట్టం 2000, ఫారిన్​ ఎక్ఛేంజ్​ మేనేజ్​మెంట్​ యాక్ట్ 2000.. వంటి చట్టాల పరిధిలో ప్రస్తుతం ఈ-కామర్స్​ విభాగం ఉంది.

ఇదీ చదవండి:'డిజిటల్‌ మోసాలకు టెక్నాలజీతో కళ్లెం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.