ETV Bharat / business

బిల్​గేట్స్​- మస్క్​.. ఏంటి ఈ విచిత్ర అలవాట్లు?

చాలా మందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. బిల్​గేట్స్​తో సహా ఐదుగురు వ్యాపార ప్రముఖులు కూడా ఈ కోవలోకే వస్తారు. ఏదైనా వస్తువును చూస్తే దాని కొలత ఎంత? అని అంచనా వేయడం ఒకరికి అలవాటైతే.. ప్రతి విషయాన్నీ సూక్ష్మంగా గమనించి తెలుసుకోవడం మరొకరికి అలవాటు. మరి వారు ఎవరో.. ఇలాంటి అలవాట్లు ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకుందాం..

bill gates weird habits, ఎలన్​ మస్క్​
వ్యాపార ప్రముఖలు
author img

By

Published : Apr 12, 2021, 5:34 PM IST

ప్రముఖుల జీవన శైలి పట్ల మనందరికీ ఆసక్తి ఉంటుంది. వారి ఆహార్యాన్ని, అలవాట్లను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అయితే వీరిలో చాలా మందికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడో, నలుగురు ఉన్నప్పుడో పలు సందర్భాల్లో వారి అలవాట్లు బయటపడతాయి. ఇందుకు ప్రముఖ సంస్థల సీఈఓలు కూడా అతీతం కాదు. ఫేస్​బుక్​, పెప్సికో, మైక్రోసాప్ట్​, టెస్లా సహా నిన్​టెన్డో సంస్థలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఇదే కోవకు వస్తారు. మరి వారి అలవాట్లు ఏంటో మీరూ చూసేయండి..

మార్క్​ జుకర్​బర్గ్

ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్..​ ఏదైనా కార్యక్రమంలో ప్రసంగానికి స్టేజ్​ ఎక్కే ముందు తన అండర్​ ఆర్మ్స్​ కి బ్లో డ్రై చేయించుకుంటారట. ఈ విచిత్రమైన అలవాటుకు కారణం ఉంది. ఆత్రుత, ఆందోళన, భయం వల్ల పట్టే చమటను ఎదుర్కోవడానికే ఇలా. ​

bill gates weird habits, ఎలన్​ మస్క్​
మార్క్​ జుకర్​బర్గ్​

పెప్సికో మాజీ సీఈఓ

పెప్సికో సంస్థ మాజీ సీఈఓ ఇంద్రా నూయికి కూడా ఓ విచిత్రమైన అలవాటు ఉందట. సాధారణంగా భోజనం చేసే సమయంలో కొందరికి నియమాలు ఉంటాయి. తినే ముందు చేతులు శుభ్రం చేసుకోమని, ఆహారాన్ని బాగా నమలాలని నియమాలు పెట్టుకుంటారు. అయితే ఇంద్రా నూయి కుటుంబం మాత్రం అందుకు భిన్నం. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు రోజూ భోజన సమయానికి ఓ ప్రసంగాన్ని సిద్ధం చేయాలని చెప్పేవారు. అది వారికి వినిపించాలి. అందులో ఎవరి ప్రసంగం బాగుంటే వారికి ఆ తల్లిదండ్రుల ఓటు.

bill gates weird habits, ఎలన్​ మస్క్​
ఇంద్రానూయి

బిల్​గేట్స్​..

మన వద్ద రాకింగ్​ కుర్చీ ఉంటే ముందుకు వెనక్కి ఊగుతూ విశ్రాంతి తీసుకుంటాం. కానీ మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ మాత్రం దానిని.. తాను ఆలోచించేందుకు ఉపయోగిస్తారు. ఆ కుర్చీలో కుర్చుని ఆలోచిస్తే తనకు మంచి ఐడియాలు వస్తాయని గేట్స్​ చెప్తుంటారు.

bill gates weird habits, ఎలన్​ మస్క్​
బిల్​ గేట్స్​

క్షుణ్ణంగా పరిశీలించడం..

స్పేస్​ఎక్స్​, టెస్లా వంటి సంస్థలను నిర్వహిస్తూ ప్రపంచ కుబేరుల రేసులో గట్టిపోటీ ఇస్తున్న ఎలాన్​ మస్క్​కు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం(నానోమేనేజింగ్​) అలవాటు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంగా ఒప్పుకున్నారు. సంస్థలోని ఉద్యోగుల ప్రతి కదలికలను గమనించడం తనకు అలవాటని పేర్కొన్నారు.

bill gates weird habits, ఎలన్​ మస్క్​
ఎలోన్​ మస్క్​

షిగేరో మియమోటో..

కూర్చీ లేదా బల్లలను చూసి వాటి పొడవు, వెడల్పు అంచనా వేసి ఆ తర్వాత వాటిని కొలిచి.. అంచనా సరైనదైతే ఆనందపడే వ్యక్తులను చూశారా? ప్రముఖ వీడియో గేమ్​ మేరియో రూపకర్త, నిన్​టెండ్​ సంస్థ మాజీ డైరెక్టర్​ షిగేరో మియమోటోకు ఇదే అలవాటు ఉంది. ఎక్కడైనా ఎదైన వస్తువు కనపడితే దాని కొలతలను అంచనా వేసి.. ఆ తర్వాత వాటిని కొలిచి, అంచనా సరిపోతే మురిసిపోతుంటారట.

ఇవీ చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.