ETV Bharat / business

'కరోనా వ్యాక్సిన్‌ తయారుచేసే సత్తా మనకు ఉంది'

"కరోనా వైరస్‌ గుర్తించలేనిది, తెలియనిదేమీ కాదు. ఈ జబ్బు స్వైన్‌ఫ్లూ కంటే ప్రమాదకరమైనది కూడా కాదు. కాకపోతే ఇది ఎంతో వేగంగా విస్తరిస్తుంది. పైగా మందులేదు. అదే ఆందోళన కలిగించే అంశం." అని వ్యాక్సిన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. ఇది మందులకు పూర్తిగా లొంగదని, దీనికి వ్యాక్సిన్‌ను కనుగొనటమే పరిష్కారమని పేర్కొన్నారు.

krishna yella interview
డాక్టర్ కృష్ణ ఎల్ల
author img

By

Published : Mar 21, 2020, 6:42 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ మనం తయారు చేయగలమని భారత్ బయోటెక్​ ఇంటర్నేషనల్​ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. చైనా, బ్రిటన్​, అమెరికాలోని శాస్త్రవేత్తలకు దీటుగా మనదేశంలో శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌ను తయారు చేయగల సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాకపోతే ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సమావేశమై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించగలిగితే ఇతర దేశాలకంటే ముందే మనం కరోనా వ్యాక్సిన్​ను మార్కెట్‌కు తీసుకురాగలమని పేర్కొన్నారు డాక్టర్​ కృష్ణ. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి పరిష్కార మార్గాలపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలెంటో చూద్దాం..

ప్రశ్న: కరోనా వైరస్‌ మహమ్మారి ఇంకెంతకాలం పాటు ప్రపంచాన్ని వేధిస్తుంది? దీనికేమైనా పరిష్కారం ఉందా?

కృష్ణ ఎల్ల: మహమ్మారి ఏదైనా ఎంత త్వరగా వచ్చిందో, అంతే త్వరగా తొలగిపోవటం గతంలో చూశాం. కరోనా విషయంలోనూ అదే జరగవచ్చు. వాస్తవానికి కరోనా వైరస్‌ కంటే స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) అత్యంత ప్రమాదకరమైనది. స్వైన్‌ఫ్లూ వల్ల యూఎస్‌లో ఏటా 60 వేల మంది చనిపోతున్నారు. యూరప్‌లోనూ స్వైన్‌ఫ్లూ మరణాలు ఎక్కువ. అదృష్ణవశాత్తూ కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తక్కువగా ఉంది. కాకపోతే సమస్య ఏమిటంటే, ఈ వైరస్‌ సోకితే ప్రస్తుతం సరైన చికిత్స లేదు. పైగా వ్యాధి నుంచి బయటపడి కోలుకున్న తర్వాత కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అందువల్ల ఇది రాకుండానే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రశ్న: వైరస్‌ వల్ల సోకే హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులను అదుపు చేసే ఔషధాలతో కొన్ని చోట్ల కరోనా వైరస్‌కు చికిత్స చేస్తున్నారు. ఇది సరైన విధానమేనా?

కృష్ణ ఎల్ల: నిర్ధరిత చికిత్స, తగిన మందు లేనందున అందుబాటులో ఉన్న యాంటీ-వైరల్‌ ఔషధాలను ఇచ్చి చూస్తున్నారు. అంతకు మించి మరో ప్రత్యేకత ఈ ఔషధాలకు లేదు. ఈ ఔషధాలతో కరోనా వైరస్‌ వ్యాధి తగ్గిపోతుందని చెప్పలేం. అది శాస్త్రీయంగా నిర్ధరణ కాలేదు. కొంతవరకూ మలేరియా మందు పనిచేస్తుంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి మలేరియా మందు ఇస్తే త్వరగా కోలుకోవచ్చు. పైగా ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు వ్యాధి విస్తరించదు. అయినా మందులతో వైరస్‌ను పూర్తిగా అదుపు చేయటం సాధ్యం కాదు. మందులకు కొన్నాళ్లకు ఈ వైరస్‌ ‘రెసిస్టెన్స్‌’ పెంచుకుంటుంది. అందువల్ల వ్యాక్సిన్‌ ఒక్కటే దీనికి పరిష్కారం.

ప్రశ్న: 'కరోనా' వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా ఎలా జరుగుతున్నాయి? ఈ విషయంలో మనదేశం పరిస్థితి ఏంటి?

కృష్ణ ఎల్ల: వ్యాక్సిన్ల తయారీ సత్తా విషయానికి వస్తే..., మనం ఏ దేశానికీ తీసిపోం. చైనా, యూరప్‌, అమెరికాలోని శాస్త్రవేత్తలు, సంస్థలతో పోల్చితే మనం ఎంతో ముందున్నామని కూడా చెప్పగలను. యూఎస్‌లో మోడెర్నా ఇంక్‌., అనే కంపెనీ ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ఫేజ్‌-1 ‘హ్యూమన్‌ టెస్టింగ్‌’ చేపట్టారు. కానీ దీని విషయంలో ప్రధానమైన ఇబ్బంది ఏమిటంటే... ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లో స్థిరత్వం (స్టెబిలిటీ) లేదు. దీనివల్ల సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించటం సాధ్యం కాదు. ఇనోవయా అనే మరొక కంపెనీ 3 గంటల్లో వ్యాక్సిన్‌కు రూపకల్పన చేసినట్లు ప్రకటించింది. కానీ అది డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌. ఈ తరహా పరిజ్ఞానం విజయవంతం అయిన దాఖలాలు లేవు. వ్యాక్సిన్‌ను తయారు చేశామని చెప్పటానికి బాగుంటుంది, కానీ అమల్లోకి తీసుకురావటం కష్టం. మా వరకూ మేం ఒక వ్యాక్సిన్ల తయారీ సంస్థగా ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం. వ్యాక్సిన్‌ తయారు చేయటమే కాకుండా దాన్ని కోట్లాది మంది ప్రజల దగ్గరకు తీసుకువెళ్లటం ఎలా? అనే విషయమై ఆలోచిస్తాం.

ప్రశ్న: ఈ వ్యాధిని ఎదుర్కొనటంలో మన సన్నద్ధత ఎలా ఉంది?

కృష్ణ ఎల్ల: ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు బాగున్నాయి. వాస్తవానికి చైనాలో, కొన్ని ఇతర దేశాల్లో విస్తరించినట్లుగా మనదేశంలో ఈ వ్యాధి వస్తే తట్టుకోవటం కష్టం. అధిక జనసాంద్రత, కాలుష్యం... వల్ల ఈ వ్యాధి త్వరగా విస్తరిస్తుంది. అందువల్ల అన్ని రకాల జాగ్రత్తలు పాటించటంతో పాటు వ్యాక్సిన్‌ తయారీ వంటి పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ విషయంలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రశ్న: పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని ఆశిస్తున్నాయి?

కృష్ణ ఎల్ల: దేశీయ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో చర్చించి, అవసరమైన మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. త్వరగా వ్యాక్సిన్‌ తీసుకు రావాలంటే మీకేం కావాలి...? అని అడిగి, అవరోధాలను తొలగించాలి. మాకేమీ నిధులు అవసరం లేదు. సత్వర అనుమతులు, క్లినికల్‌ పరీక్షల విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే చాలు. అమెరికాలో కొన్ని కంపెనీలకు అటు జంతు పరీక్షలు, ఇటు మనుషుల మీద ఒకేసారి పరీక్షలు చేసేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఏ దశలో ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్కడ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇటువంటి విప్లవాత్మక విధానాలను మనదేశంలోనూ పరిశీలించాలి. స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలి. ఇప్పటికి కాకపోయినా... భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్‌ విస్తరిస్తే, అప్పటికి అయినా మనం వ్యాక్సిన్‌తో సమాయత్తమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఇదీ చూడండి: బాలీవుడ్​ గాయనితో పార్లమెంట్​కు కరోనా సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.