ETV Bharat / business

మొత్తం కట్టేస్తా.. నాపై కేసు కొట్టేయండి: మాల్యా

భారత్​లో రూ.9 వేల కోట్లు అప్పు చేసి లండన్​కు పారిపోయిన లిక్కర్​ కింగ్​ విజయ్​మాల్యా.. ఆ బాకీ తిరిగి చెల్లిస్తానని ప్రకటించారు. 100 శాతం డబ్బులు తీసుకుని, తనపై ఉన్న మనీలాండరింగ్​ కేసు కొట్టేయాలని కోరారు.

Vijay Mallya asks govt to accept loan repayment offer, close case against him
మొత్తం కట్టేస్తా.. నాపై కేసు కొట్టేయండి: మాల్యా
author img

By

Published : May 14, 2020, 10:28 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్​ కింగ్​ విజయ్​మాల్యా బ్యాంకులకు ఓ బంపర్ ఆఫర్​ ఇచ్చారు. తాను ఎగవేసిన రూ. 9 వేల కోట్లను తిరిగి తీసుకుని, తనపై ఉన్న కేసులు కొట్టేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

కరోనాపై పోరు కోసం భారత్​ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్​పై ట్విట్టర్​లో మాల్యా స్పందించారు.

''ప్రభుత్వం ఎంత కావాలంటే అన్ని నోట్లు ముద్రించుకోవచ్చు.. కానీ, నా లాంటి ఓ చిన్న చెల్లింపుదారుడు దేశీయ బ్యాంకులకు 100 శాతం బాకీలు తిరిగి చెల్లిస్తానంటే పట్టించుకోవట్లేదేంటీ? దయచేసి నా దగ్గర డబ్బులు స్వీకరించి, కేసు మూసేయండి."

-విజయ్​ మాల్యా

గత ఫిబ్రవరీలోనూ బ్యాంకులకు ఇలాంటి ఆఫరే ఇచ్చారు మాల్యా. అయితే, బ్యాంకులు ఆయన మాటలను పట్టించుకోలేదు. జప్తు చేసిన మాల్యా ఆస్తులను తిరిగి ఇచ్చేందుకు ​ఈడీ ముందుకు రాలేదు.

మాల్యాను అప్పగించాలని భారత్​... బ్రిటన్​ ప్రభుత్వాన్ని కోరగా లండన్​ కోర్టు ఇందుకు అంగీకరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ, బ్రిటిష్​ కోర్టులో మాల్యా పిటిషన్​ వేశారు.

కింగ్​ ఫిషర్​ ఎయిర్​లైన్స్​ అధిపతిగా భారత బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లు అప్పుతీసుకున్న ఆయన తిరిగి చెల్లించనందుకు మనీలాండరింగ్​ కేసులో చిక్కుకున్నారు.

ఇదీ చదవండి:రోజుకు 6 వేల మంది చిన్నారులకు ప్రాణగండం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.