ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించేందుకు గడువు పెంచే ప్రసక్తే లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 15 వరకు విధించిన గడువు లోపు టిక్‌టాక్ యాజమాన్య హక్కులు అమెరికా సంస్థలకు విక్రయించకుంటే.. యాప్‌పై నిషేధం తప్పదని ట్రంప్ గత నెల డెడ్‌లైన్ విధించి విషయం తెలిసిందే.
టిక్‌టాక్ కొనుగోలు కోసం దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ చర్చలు జరుపుతున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించగా.. ఇంత వరకు ఆ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరలేదు.
ఈ నేపథ్యంలో టిక్‌టాక్ అమెరికాలో పూర్తిగా మూత పడుతుందా.. గడువులోపు ఏదైనా సంస్థకు విక్రియిస్తుందా? అనేది వేచిచూడాలి.
ఇదీ చూడండి:చైనా ఒప్పుకుంటేనే టిక్‌టాక్ విక్రయం?