ETV Bharat / business

వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా? - తెలుగు బిజినెస్ వార్తలు

ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లు.. సరికొత్త ఫీచర్లు అందిస్తూ యూజర్లకు దగ్గరయ్యే వాట్సాప్ ఈ సారి భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తేనుంది. ఇప్పటికే ఫింగర్​ ప్రింట్​, గ్రూప్ ప్రైవసీ ఫీచర్లు తెచ్చిన వాట్సాప్​.. త్వరలో డార్క్​మోడ్, బూమరాంగ్​ వంటి మరెన్నో ఫీచర్లు తీసుకురానుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

వాట్సాప్​
author img

By

Published : Nov 17, 2019, 8:01 AM IST

వాట్సాప్​.. స్మార్ట్​ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్​ను వాడుతున్నారు. కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు. ఈ యాప్​ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు. యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్​ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్​డేట్లు తెస్తుంది. తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్​బుక్​కు చెందిన మెసెంజర్ దిగ్గజం​. ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం.

డార్క్​ మోడ్​..

వాట్సాప్​ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్​.. డార్క్​ మోడ్​. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్​ ఇంటర్​ఫేస్​​ సహా.. అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది. దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్​ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోన్​​ ఛార్జింగ్​ ఎక్కువసేపు వస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది.

బూమరాంగ్ ఫీచర్​..

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్​ బూమరాంగ్. ఏదైన ఫొటోను సరదాగా స్వల్ప నిడివిగల వీడియోగా మార్చడమే ఈ ఫీచర్​లో ఉన్న సౌకర్యం. ప్రస్తుతం ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఫీచర్​ తెగ హల్​చల్​ చేస్తోంది. అలాంటి ఫీచర్​ను తమ వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్​ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుంది.

డిలీట్​ ఆటోమేటిక్​..

వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్​ అయ్యేలా ఓ ఫీచర్​ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒక వాట్సాప్ యూజర్​ మరో వాట్సాప్ యూజర్​కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్​ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్​ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్​ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగపడనుంది.

ప్రస్తుతం 'డిలీట్​ బోత్'​ అనే ఫీచర్​ ఇంచుమించు ఇలాంటి సదుపాయాలతో అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ద్వారా ఒకరికి పంపాల్సిన సందేశం వేరొకరికి పంపినప్పుడు.. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ సందేశాన్ని పూర్తిగా డిలీట్​ చేయొచ్చు. గరిష్ఠంగా.. సందేశం పంపిన గంటలోపు డిలీట్ ​బోత్​ సదుపాయాన్ని వినియోగించే అవకాశముంది. ముఖ్యంగా యూజర్ మాన్యువల్​గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది.

ఇటీవలి కొత్త ఫీచర్లు ఇవే..

వాట్సాప్ ఇప్పటికే.. ఫింగర్​ప్రింట్​, ఫేస్​ అన్​లాక్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు అనవసర గ్రూపుల్లో.. గుర్తు తెలియని వారు మిమ్మల్ని చేర్చేందుకు వీలు లేకుండా సెక్యూరిటీ ఫీచర్​ను తెచ్చింది. దీని ద్వారా మీరు ఎంపిక చేసుకున్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చే వీలుండనుంది.

ఇదీ చూడండి: ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 16 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1337: Syria Car Bomb MANDATORY ON-SCREEN CREDIT: Albab City 4240250
Aftermath of car bomb in northeast Syria at least 12 dead
AP-APTN-1330: France Yellow Vests AP Clients Only 4240249
Police clash with yellow vest protesters on anniversary of uprising
AP-APTN-1307: Iran Fuel Protests No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4240247
Protests in Iranian cities over gasoline price hikes
AP-APTN-1216: Hong Kong Campus Occupation AP Clients Only 4240246
Protesters occupy Hong Kong's Polytechnic in Kowloon
AP-APTN-1203: Hong Kong Chinese Soldier Clean Up AP Clients Only 4240244
Chinese army join in clean-up after protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.